Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లో మాయని మచ్చ ఇదేనా..? మిగతా హీరోల సంగతేంటి..?

మెగాస్టార్‌కి ఇప్పుడు భోళా శంకర్ మాయని మచ్చలా మారింది. కథ, కథనం, మేకింగ్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లో ఊహించని షాక్ ఇది. డైరెక్టర్ మోహర్ రమేష్ పుణ్యమాని చిరు కెరీర్‌లో ఈ మూవీ డిజాస్టర్‌గా మారింది. హీరోలన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 05:34 PM IST

Chiranjeevi: చిరంజీవి అంటే అటు రజినీకాంత్‌లా స్టైల్‌తో మాస్‌ని ఎంటర్‌టైన్ చేయగలడు. కమల్ హాసన్‌లా నవరసాలు పండించగలడు. అందుకే వాళ్లిద్దరు కలిపితే మెగాస్టార్ చిరు అని అప్పట్లో తమిళ దర్శకుడు కే బాలచందర్ మెచ్చుకున్నాడు. అలాంటి మెగాస్టార్‌కి ఇప్పుడు భోళా శంకర్ మాయని మచ్చలా మారింది. కథ, కథనం, మేకింగ్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లో ఊహించని షాక్ ఇది. డైరెక్టర్ మోహర్ రమేష్ పుణ్యమాని చిరు కెరీర్‌లో ఈ మూవీ డిజాస్టర్‌గా మారింది. హీరోలన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.

ఆమాత్రానికే మాయని మచ్చంటామా అంటే.. కొన్ని సినిమాలు ఫ్లాపైనా డబ్బులు రాలేదంటారు కానీ.. తలదించుకునే పరిస్థితులు పగపట్టవు. అలానే చిరు స్థాయిని భోళా శంకర్‌తో మోహర్ రమేష్ సాంతం కిందికి దించేశాడంటున్నారు. ఇలాంటి మచ్చలు చిరుకే కాదు.. ఆల్ మోస్ట్ అందరికీ ఉన్నాయి. ఇదే మోహర్ రమేష్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ శక్తి లాంటి డిజాస్టర్‌ని పొందాడు. అది తనకి మరిచిపోలేని పీడకల అని కూడా ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు తారక్. ఇలా చూస్తే మహేశ్ బాబుకి బ్రహ్మోత్సవం మాయని మచ్చ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి పులి తన కెరీర్ మొత్తం వెంటాడే డిజాస్టర్‌గా చెప్పుకోవచ్చు. నిజానికి జానీ కూడా ఫ్లాపే కాని ఎవరూ ఆ సినిమా పరంగా పవన్‌ని తక్కువ చేసి మాట్లాడలేదు. కాని పులి అదో ఘోరమైన అనుభవమని ఫ్యాన్సే అనే పరిస్థితి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సాధ్యమైనంత వరకు మరిచిపోవాలనుకునే సినిమా చక్రం. ఆదిపురుష్, రాధేశ్యామ్ ఆడకున్నా కథలో లోపాలను తప్పుపట్టరు. కానీ.. చక్రం మాత్రం అలాకాదు.

అది కృష్ణ వంశీ పైత్యానికి పరాకాష్ట అనేశారు. ఇలానే విక్టరీ వెంకటేశ్ కూడా పిల్లోడిలా మారి.. ఆంటీ ఆంటీ అంటూ చేసే భయానక కామోడీ మూవీ షాడో. చరణ్‌కి ఆరేంజ్, బన్నీకి వరుడు ఇలా ఒక్కో హీరోకి ఒక్కో డిజాస్టర్ మాయని మచ్చలా మారింది. అలా చూస్తే రౌడీ స్టార్‌కి అర్జున్ రెడ్డి కెరీర్‌ని క్రియేట్ చేసిన మూవీ అయితే.. లైగర్ కెరీర్‌ని నాశనం చేయబోయిన సినిమా అనేశారు. మరి నాగార్జున, బాలయ్యలకు అలాంటి మూవీ ఏది లేదా అంటే, వాళ్లు పాపం ఒకటికి మించే అలాంటి పంచ్‌లు ఫేస్ చేశారు. ఇక్కడ డైరెక్టర్స్‌ని గుడ్డిగా నమ్మటం వల్లనే 90శాతం వరకు మచ్చల్లాంటి డిజాస్టర్లు వచ్చాయని లిస్ట్ చూస్తేనే తేలిపోతోంది.