Bhola Shankar: ఫ్రూట్ సలాడ్ తెలుసుగా.. అన్ని పండ్లు కలిపేసి.. కాస్త షుగర్ సిరప్ వేసి ఇస్తారు. రుచి మాత్రం అదిరిపోతుంది. అటు ఇటుగా అలానే ఉంది భోళాశంకర్ ట్రైలర్. ఇక్కడ స్వీట్ ఏంటంటే.. చిరు యాక్టింగ్. మిగతా పండ్లన్నీ కామన్‌గా కనిపించేవే. స్టోరీ, స్క్రీన్‌ప్లే, పాటలు, డ్యాన్స్ సంగతి ఎలా ఉన్నా.. మెగాస్టార్ మాత్రం కేక పుట్టించాడు.
ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించాడు మెగాస్టార్. యాక్షన్ సీన్స్, కామెడీ సీన్లు చూస్తే.. వింటేజ్ చిరు కనిపించాడు చాలాసార్లు. భోళాశంకర్ ట్రైలర్‌ను రాం చరణ్ లాంఛ్ చేశాడు. ట్రైలర్ ఓపెన్ చేస్తే.. కలకత్తాలో చాలామంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు. మిస్సింగ్‌ల వెనక ఎవరు ఉన్నారో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో పోలీసులు భోళాశంకర్ హెల్ప్ తీసుకుంటారు. శంకర్ ఏం చేశాడు.. అసలు శంకర్‌కు ఏం జరిగింది.. మిస్సింగ్‌లతో ఆయనకు ఏంటి సంబంధం అనేదే అసలు స్టోరీ. ట్రైలర్ కట్ చూస్తే కొత్తగా అనిపించదు. ఎలివేషన్ కోసం డైలాగులు అతికించినట్లు అనిపిస్తాయ్ తప్ప.. నేచురాలిటీ కనిపించలేదు చాలా మాటల్లో..! రంగస్థలంలో రాంచరణ్‌కు బాబులా యాక్ట్ చేస్తున్నారని తమన్న.. నా వెనక దునియా ఉందని చిరు.. ఈ జనరేషన్ యూత్‌కు ఈ డైలాగులు ఎబ్బెట్టుగా అనిపించడం ఖాయం. ట్రైలర్ చూస్తున్నంత సేపు.. ఏవో సినిమాలోని సీన్స్ గుర్తుకు వస్తూనే ఉంటాయ్.
భోళా శంకర్‌కు పెద్ద ఇబ్బంది ఇదే. సీన్ల సంగతి ఎలా ఉన్నా.. చిరు మాత్రం చింపి పారేశాడు. మెగాఫ్యాన్స్‌కు కచ్చితంగా పండగే. కామెడీ, యాక్షన్, డ్యాన్స్‌లతో దుమ్మురేపాడు చిరు. తాను ఇంకా పోటీలో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఐతే భోళా శంకర్ మీద క్యూరియాసిటీ కంటిన్యూ చేసేందుకు చాలా సీన్లు దాచిపెట్టినట్లు కనిపిస్తోంది. ఖుషీ మూవీలో ఏ మే రాజహా సాంగ్‌కు చిరు స్టెప్పులను రివీల్ చేయనిది అందుకే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే! శ్రీముఖితో కలిసి ఖుషీ మూవీ నడుము సీన్ స్ఫూఫ్ చేశారని టాక్. అది కూడా ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. ఇక ట్రైలర్ ఎండింగ్‌లో పవర్ స్టార్ మేనరిజాన్ని చిరు ఇమిటేట్ చేయడం అదిరిపోయింది. 2 నిమిషాల 25 సెకన్ల ట్రైలర్‌లో అదే అదిపెద్ద హైలైట్. మెగా ఫ్యాన్స్‌ను ట్రైలర్ ఆకట్టుకోవడం ఖాయం. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ చెల్లిగా యాక్ట్ చేస్తుండగా.. సుశాంత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ కొడుకు మహతి మ్యూజిక్ అందించాడు.