Bhola Shankar: వివాదమో.. విశేషమో.. గత వారం రోజులుగా భోళాశంకర్ ఏదోలా న్యూస్‌లో ఉంటోంది. మెగాఫ్యామిలీ వర్సెస్ ఏపీ సర్కార్ మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం.. ప్రమోషన్స్‌లో స్వయంగా చిరు పార్టిసిపేట్ చేసి బజ్ క్రియేట్ చేయడంతో.. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో.. సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు కలకత్తా బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో చిరుకు బాగా కలిసొస్తుందనే మౌత్‌టాక్ కూడా స్ప్రెడ్ అయింది.
అదే సమయంలో మెహర్ రమేష్ సినిమా అనేసరికి.. మనసులో ఏదో ఒక మూల అనుమానం అలాగే ఉండిపోయింది. అసలే రీమేక్.. మెహర్ దీన్ని ఎలా డీల్ చేశాడు.. సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి.. అందరిలోనూ కనిపిస్తోంది. నిజానికి మెహర్ రమేష్‌తో సినిమా అంటే.. వెక్కిరించిన నోళ్లు, విదిల్చిన నుదుర్లు ఎన్నో..! ఓవర్సీస్‌లో ఫస్ట్ షో పడింది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. భోళా భలే అనిపిస్తున్నాడు. స్టోరీలోకి వస్తే.. కలకత్తాలో టాక్సీ డ్రైవర్ భోళా శంకర్. చెల్లెలు కీర్తి సురేష్‌ని బాగా చదివించి.. మంచి భవిష్యత్ ఇవ్వాలని కష్టపడతుంటాడు. శంకర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే..! ఆడపిల్లకి ఆపద వచ్చిందంటే అక్కడ శంకర్ టాక్సీ ఉంటుంది. కలకత్తాలో మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోతూ ఉంటాయి. విమెన్ ట్రాఫికింగ్ కేసుల్ని ఛేదించడానికి పోలీసులకు సాయం చేస్తుంటాడు శంకర్. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. శంకర్ తన సొంత అన్న కాదనే విషయం తెలుసుకుంటుంది.. అసలు శంకర్ ఎవరు.. అతని ఫ్లాష్‌బ్యాక్ ఏంటి అన్నదే మిగిలిన స్టోరీ.
వేదాళం సినిమాకు భోళా శంకర్ రీమేక్ కాగా.. తెలుగులో చాలా మార్పులు చేశారు. కథలో మెయిన్ ప్లాట్‌ని డిస్టబ్ చేయకుండా చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ భోళా శంకర్‌లో చేర్చారు. మాసూ.. క్లాసూ మాత్రమే కాదు.. మెగాస్టార్‌లో కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య సెంటిమెంట్ సీన్‌లు సినిమాకి ప్లస్ కాగా.. మిల్కీ అందాలతో తమన్నా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. డాన్స్‌లో చిరంజీవి గ్రేస్ అండ్ స్టైల్ చూస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్ అంతా..! వింటేజ్ చిరు కనిపించాడు స్క్రీన్ మీద. ఓవరాల్‌గా ఓవర్సీర్‌లో భోళాశంకర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. మెహర్ రమేష్‌కు ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అంటున్నారు. సినిమా అంతా ఒకెత్తు.. సెకండాఫ్ మరో ఎత్తు.. నెక్ట్స్ లెవల్ అంటూ ఓవర్సీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓవర్సీస్ టాక్ అదిరిపోయింది. ఇదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా అంటే వెయిట్ అండ్ వాచ్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో మెగా పండుగ వాతావరణం అయితే మొదలైంది.