Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ.. మూడు సీక్రెట్లు చెబుతానంటున్న అమితాబ్ బచ్చన్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు 3 గుడ్ న్యూస్ లు రెడీ అవుతున్నాయి. ఏకంగా బాలీవు్డ బడా బచ్చన్ అమితాబ్ ఈ గుడ్ న్యూస్ అందరికి చెప్పబోతున్నాడు. ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కే లో అమితాబ్ కూడా స్పెషల్ రోల్ వేశాడు. అందుకే ఈ మూవీ తాలూకు 3 సీక్రెట్లను విప్పే బాధ్యత తనది అంటున్నాడు.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 06:00 PM IST

ఇప్పటికే ప్రాజెక్ట్ కే టైటిల్ , గ్లింప్స్ వచ్చే వారం 20 తేదీనా రివీల్ కాబోతోందని ఫిల్మ్ టీం తేల్చింది. ప్రాజెక్ట్ కే సీక్వెల్ టైటిల్ కూడా తేలబోతోంది. అమెరికాలోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొనే హాజరు కానున్నట్టు ఫిల్మ్ టీం తేల్చింది. ఇంకా తేల్చంది ఏదైనా ఉందటే, అదే అమితాబ్ బచ్చన్ ఎంట్రీ.

బిగ్ బీ కూడా కామిక్ కాన్ ఈవెంట్ కి రాబోతున్నాడట. నిజానికి ప్రాజెక్ట్ కే గ్లింప్స్ లాంచ్ కే కామిక్ కాన్ ఈవెంట్ ని ఫిల్మ్ టీం వాడుకుంటోందట. ఇక వచ్చే గురువారం యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టైటిల్ ని, గ్లింప్స్ ని, అలానే ప్రాజెక్ట్ కే సీక్వెల్ టైటిల్ ని లాంచ్ చేసే బాధ్యత అమితాబ్ కే అప్పచెప్పిందట నాగ్ అశ్విన్ టీం. సో ఆరోజు ఈవెంట్ లో రివీల్ అవ్వాల్సిన ఈ మూవీ గ్లింప్స్, రెండు టైటిల్ పోస్టర్లని అమితాబ్ తన ట్విట్టర్ లో 19 రాత్రిన రివీల్ చేస్తాడట. అది మన కాల మానం ప్రకారం ఇక్కడ 20 వతేదీ ఉదయం కాబట్టి, అలా అప్ డేట్స్ రివీల్ కాబోతున్నాయట.