బిగ్ బ్రేకింగ్; అవును చేశా, ఒప్పుకున్న జానీ మాస్టర్

జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవా లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను రిమాండ్ కు అప్పగించాలని కోర్ట్ లో పోలీసులు పిటీషన్ వేయగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది.

  • Written By:
  • Publish Date - September 20, 2024 / 04:01 PM IST

జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవా లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను రిమాండ్ కు అప్పగించాలని కోర్ట్ లో పోలీసులు పిటీషన్ వేయగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడన్న పోలీసులు… 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ లైంగిక దాడి చేసారని స్పష్టం చేసారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు మాత్రమే అని నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి దిగినట్టు పోలీసులు వెల్లడించారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని రిపోర్ట్ లో పేర్కొన్నారు.