ప్రభాస్ తో ఏడడుగులు నడిచేందుకు.. 7 సముద్రాలు దాటాలి…

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 02:52 PM IST

రెబల్ స్టార్ పెళ్లెప్పుడు… ఇది ఒకప్పుడ టాలీవుడ్ ప్రశ్న, ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యాన్స్ నుంచి ఎదురయ్యే ప్రశ్న. ప్రభాస్ పెళ్లంటే, పాన్ ఇండియాలెవల్లో తన ఫ్యాన్స్ కి పండగే… అయితే కల్కీకి ముందు వరకు ప్రభాస్ పెళ్లి మీద చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. కాని కల్కీ ప్రమోషన్ టైంలో మాత్రం కల్కీ మీదే తప్ప తన పెళ్లి మీద ప్రశ్నలు తగ్గాయి.

కారనం సలార్, కల్కీ రెండు మూవీలకు ప్రభాస్ ప్రమోషన్ తగ్గించటం, కేవలం ఈసినిమాలు తన ఇమేజ్ మీదే జనాల్లోకూడా దూసుకెళ్లటం… ఇలా కారణాలు ఏమైనా, వచ్చే ఏడాది నుంచి ఎవరూ తనని తన పెళ్లి గురించి అడిగే ఛాన్స్ ప్రభాస్ ఇవ్వడని తెలుస్తోంది.

అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? ఎలాంటి క్లారిటీ డైరెక్ట్ గా రావట్లేదు. కాని ఈ ఏడాదిలోపే రెబల్ స్టార్ ఓ ఇంటివాడవుతాడనే హింట్లు మాత్రం అందుతున్నాయి. లండన్ లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలీ నుంచే ప్రభాస్ లైఫ్ లోకి ఒకరు ఎంటర్ కాబోతున్నారని తెలుస్తోంది.

లండన్ లో ఓ సొంతిల్లుని కోట్లు పెట్టి ప్రభాస్ కొనటం వెనక అదే కారణం అనంటున్నారు. అంతేకాదు ఆ ఇంటికి లేడీ పేరు పెట్టబోతున్నాడట. అది మాత్రం రివీల్ కానీయలేదు. తన ఇంటికి తల్లీ లేదంటే సిస్టర్స్ పేరు పెట్టుకునే ఛాన్స్ఉంది. ఆమాత్రానికే, అది తనకు కాబోయే వైఫ్ పేరే అనగలమా అంటే, అందిన హింట్ చూస్తే అదే నిజమనేలాఉంది. ఎందుకంటే లండన్ లో ప్రభాస్ సొంతింటికి తన మదర్ లేదంటే సిస్టర్ పేరు పెట్టలేదని తెలుస్తోంది. మరి ఏ పేరు పెట్టాడంటే, ఆన్సర్ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. దసరాకి లండన్ లో ఇంటికి గ్రుహప్రవేశం ప్లాన్ చేశారట. అప్పుడు ఆ ఇంటికి పెట్టిన లేడీ పేరు రివీల్ అవుతుంది. దాన్ని బట్టి ప్రభాస్ లైఫ్ లోకి వచ్చే లేడీ ఎవరో, పేరు పరంగానైనా తెలుస్తుంది…