Munawar Faruqui: చాలా కాలంగా బుల్లితెరను ఏలుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్. కేవలం తెలుగులోనే కాదు. ఇండియా వైడ్‌గా చాలా భాషల్లో బిగ్‌బాస్ చాలా ఫేమస్. బాలీవుడ్‌లో రీసెంట్‌గా ఈ షోలో 17వ సీజన్ కూడా పూర్తయ్యింది. హిందీ 17వ సీజన్ విన్నర్‌గా మునావర్ ఫరూఖీ ట్రోఫీ అందుకున్నాడు. తన బర్త్ డే రోజునే ట్రోఫీ అందుకోవడం తనకు మరింత స్పెషల్‌గా మారిందని చెప్పాడు మునావర్. ఈ టైటిల్ విన్నింగ్‌తో ఇండియా వైడ్‌గా ఫేమ్ సంపాదించుకున్న మునావర్.. కొంత కాలం క్రితం మాత్రం తెలంగాణలో తీవ్ర వివాదానికి కారణమయ్యాడు.
PRASANTH VARMA: వివాదంలో వర్మ.. హనుమాన్ డైరెక్టర్‌పై విమర్శలు..
మునావర్ ఫరూఖీ ఓ స్టాండప్ కమేడియన్. తన షోలో భాగంగా ఓసారి రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలు అతనిపై దుమ్మెత్తిపోశాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు హైదరాబాద్‌లో మునావర్ షో ఏర్పాటు చేశారు. అంతే.. ఇక్కడి హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీతమ్మను కించపర్చిన మునావర్ షో హైదరాబాద్‌లో బ్యాన్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక ఈ విషయంలో మునావర్‌కు మద్దతుగా కేటీఆర్ ట్వీట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే.. ఈ విషయంలో దేనికైనా తెగిస్తానంటూ చెప్పారు. సింపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారేమో అన్న స్థాయికి పరిస్థితి హీటెక్కింది. అయినా మునావర్ షో నిర్వహించడంతో రాజాసింగ్ కంట్రోల్ తప్పారు. మునావర్‌ను అనుకరిస్తూ మహ్మద్ ప్రవక్త గురించి స్టాండప్ స్టైల్‌లో ఓ కామెడీ వీడియో రిలీజ్ చేశాడు.
అంతే.. ఆ వీడియోపై దేశవ్యాప్తంగా చిన్నపాటి యుద్ధం జరిగింది. కొంత మంది ఐతే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ కూడా బెదరించారు. దీంతో పోలీసులు సుమోటోగా రాజాసింగ్ మీద కేసు నమోదు చేశారు. బీజేపీ రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. రీసెంట్‌గా ఎన్నికల సమయంలో సస్పెన్షన్ ఎత్తివేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇలా వారం రోజుల్లో ఈ మునావర్ వల్ల తెలంగాణలో మినీ సైజ్ యుద్ధం జరిగింది. కొన్ని రోజులకు సైలెట్ ఐన మునావర్ పేరు.. ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది.