BIGG BOSS 7: బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. దీంతో ఇంటిసభ్యుల అసలు స్వరూపం బయటపడుతోంది. రెండ్రోజులపాటు నామినేషన్ల రచ్చతో హాట్ హాట్‌గా మారిన హౌస్.. చిల్ మోడ్‌లోకి వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ షో క్లోజ్ అవుతుండటంతో ఆసక్తికరంగా మారబోతుంది. ఓవైపు నామినేషన్ల తాలుకూ ఎఫెక్ట్ ఇంంట్లో బాగా కనిపించింది. ఇంటి సభ్యులంతా.. అదే టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్‌లు మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అమర్‌ను పిలిచి కేక్ తినాలని సూచించాడు బిగ్ బాస్.
Animal: కలెక్షన్ల సునామీ.. రూ.500 కోట్ల యానిమల్..!
పూర్తి కేక్ తింటే.. ఇంటిసభ్యులు తినే అవకాశం వస్తుందని సూచించాడు. అయితే అమర్ పూర్తి కేక్ తినలేకపోయాడు. ఇంటిసభ్యులకు డైరెక్ట్‌గా ఆడియెన్స్‌తో తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. అంతేకాక మరికొన్ని గేమ్స్ టాస్క్‌లు ఆడించాడు బిగ్ బాస్. ఇందులో మొదట పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని ముందుగా స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యావర్ విన్నర్ అయ్యారు. చివరి నిమిషంలో శివాజీ ఓడిపోయారు. ఆ తర్వాత జంపింగ్ టాస్క్‌లో శోభా శెట్టి విన్నర్ అయ్యింది. ఇందులోనూ చివర్లో శివాజీ ఓడిపోయాడు. ఇలా ఈ రెండు టాస్క్‌ల్లో యావర్, శోభ విన్నర్‌గా నిలిచి తమకు ఓటు వేయాలనే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే ఇందులోనూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఆ అవకాశం ఉందన్నారు. ఆ ఒక్కరు ఎవరో ఇతర ఇంటి సభ్యులు నిర్ణయించాల్సి ఉందన్నారు. శోభాకి.. అమర్ దీప్, ప్రియాంక, అర్జున్ ఓటు వేశారు. యావర్‌కి ప్రశాంత్, శివాజీ ఓటు వేశారు.
ఇందులో శోభా విన్నర్ అయ్యింది. ఆమె డైరెక్ట్‌గా ఆడియెన్స్‌కి రిక్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని అందుకుంది. అమ్మ సపోర్ట్‌తో ఇక్కడి వరకు వచ్చానని.. తాను తొలి లేడీ టైటిల్ విన్నర్‌గా నిలవాలనుకుంటున్నట్టు చెప్పింది శోభా. ఇదిలా ఉంటే మధ్యలో అమర్, ప్రియాంక, శోభాకు మధ్య గొడవలు జరిగాయి. ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి సరదాగా ఆడుకునే సమయంలో బొమ్మతో ప్రియాంక గట్టిగా కొట్టింది. అది అమర్ ముక్కుకి తగిలింది. దీంతో అమర్ దీప్ ఆ బొమ్మని విసిరేసి కోపంతో రియాక్ట్ అవుతూ వెళ్లిపోవడంతో ప్రియాంక, శోభా శెట్టి హర్ట్ అయ్యారు. దీంతో ఆయనపై అలిగారు. దీనికోసం ముగ్గురు గొడవ పడ్డారు. అంతకు ముందు ప్రశాంత్ విషయంలో ఈ ముగ్గురు చర్చించుకున్నారు. అంతేకాక ఓటింగ్ విషయంలో సపోర్ట్‌గా ఉన్నారు. మొత్తానికి ఎపిసోడ్ కూల్‌గా సాగిపోయింది.