Bigg Boss : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..

శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో హీటెక్కిపోయిన బిగ్ బాస్ హౌస్‌లో.. సండే మాత్రం ఫ‌న్‌డే గా గ‌డిచింది.. శనివారం కంటెస్టంట్ల‌పై ఫుల్ ఫైర్ అయిన హోస్ట్ నాగార్జున‌.. ఆదివారం మాత్రం కూల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు.. మ‌రో వైపు ఇంకా ఒక్కవారమే ఉండటంతో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అన్నదాని పై టెన్షన్ నెలకొంది.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైనలిస్ట్ ఎవరు అన్న‌ది కన్ఫామ్ చేసేశారు. ఆడుతూ పాడుతూ జరిగిన ఈ ఎపిసోడ్ లో నాగార్జున వరుసగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు. వచ్చి రాగానే సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ప్రియాంకను అనౌన్స్ చేశారు నాగార్జున దాంతో అమ్మడు ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది..

శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో హీటెక్కిపోయిన బిగ్ బాస్ హౌస్‌లో.. సండే మాత్రం ఫ‌న్‌డే గా గ‌డిచింది.. శనివారం కంటెస్టంట్ల‌పై ఫుల్ ఫైర్ అయిన హోస్ట్ నాగార్జున‌.. ఆదివారం మాత్రం కూల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు.. మ‌రో వైపు ఇంకా ఒక్కవారమే ఉండటంతో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అన్నదాని పై టెన్షన్ నెలకొంది.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైనలిస్ట్ ఎవరు అన్న‌ది కన్ఫామ్ చేసేశారు. ఆడుతూ పాడుతూ జరిగిన ఈ ఎపిసోడ్ లో నాగార్జున వరుసగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు. వచ్చి రాగానే సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ప్రియాంకను అనౌన్స్ చేశారు నాగార్జున దాంతో అమ్మడు ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది.

నిన్న‌టి ఎపిసోడ్‌లో.. కంటెస్టెంట్‌లు ఏ వారం చేసిన త‌ప్పుల‌కు ప‌శ్ఛాత్తాపం ఫీల్ అయ్యారో చెప్పాలంటూ గేమ్ పెట్టారు నాగ్.. వారాల నంబర్స్ పెట్టి ఒక వీల్ ఇచ్చారు. ఆ వీల్ ని తిప్పి వాళ్ళు ఏ వారంలో చేసిన దానికి పశ్చాత్తాప ఫీల్ అవుతున్నారో కంటెస్టెంట్స్ చెప్పాలి.. ముందుగా ప్రియాంక వీల్ తిప్పి 7వారం తన ప్రవర్తనకు రిగ్రెట్ అవుతున్నట్టు చెప్పింది. భోలే అన్న విషయంలో అది అనకుండా ఉండాల్సింది అని అంది.. శోభాశెట్టి 9వ వారంలో యావర్ ని తిట్టకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం ఫీల్ అయింది. అమర్ 14వ వారం తాను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందని అన్నాడు. శివాజీ కూడా 14వ వారంలో ఆడపిల్లల గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నాడు. అనంతరం కంటెస్టెంట్స్ మీద సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ చూపించి కాసేపు నవ్వించారు నాగ్..

ఈ వారం గెస్ట్‌గా ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, సంగీత దర్శకుడు MM కీరవాణి కాసేపు కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు.. నాగార్జున నా సామిరంగ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని కీర‌వాణి బిగ్ బాస్ వేదికపై లాంచ్ చేశారు.. ఆ త‌ర్వాత ఫినాలేకి ఎవరెవరు వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ అయింది చెప్పారు నాగార్జున. ఆల్రెడీ అర్జున్ ఫినాలేకి అర్హత సాధించగా ప్రియాంక కూడా ఫైనల్ కి వెళ్ళింది. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్, యావర్, శివాజీలు కూడా ఫినాలేకి వెళ్లినట్టు చెప్పారు నాగ్. శోభాశెట్టి ఎలిమినేట్ అయిందని ప్రకటించారు.. శోభా ఎలిమినేట్ కావడంతో ప్రియాంక కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది.

ఎలిమినేట్ కావ‌డంతో స్టేజి మీదకు వచ్చిన శోభా ఒక్కసారిగా ఏడ్చేసింది.. వేదికపైకి వెళ్లి తన జర్నీ మొత్తం చూసుకుంది.. ఆ స‌మ‌యంలో శోభా శెట్టి భావోద్వేగాన్ని దాచుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చేస్తూ వేదికపైనే కుప్పకూలి కూర్చుండిపోయింది. నాగ్ ఓదార్చ‌డంతో కాస్త కుదురుకున్న శోభా శెట్టి వెళ్ళిపోతూ శివాజీ, యావర్ గురించి.. వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పి, వాళ్ళ మీద ఫైర్ అయి మ‌రీ వెళ్ళింది.. అయితే.. బిగ్ బాస్‌లో ఐదుగురు ఫైన‌లిస్టులు ఉంటారు. కానీ ఈసారి ఆరుగురిని ఫైన‌లిస్టులుగా ఉంచారు. మరి వీరిలో మధ్యలో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో..? బిగ్ బాస్ క‌ప్ కొట్టేదెవ‌రో అన్న‌ది ఇంట్రెస్టింగ్‌గా మారింది.