Bigg Boss season 7 : గౌతమ్ ఎలిమినేషన్.. టైటిల్ విన్నర్ కి 50 లక్షలు..

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ 7 కు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలో ఫైనలిస్ట్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు 13వ వారం సైతం పూర్తైంది. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటిని పెంచేసి కంటెస్టెంట్స్ ఆట తీరు, గొడవలు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత, రన్నరప్‌, టాప్‌-5 కంటెస్టెంట్స్ ఎవరనేది ,విన్నర్ ప్రైజ్ మనీ ఎంత అన్నది ఆసక్తిగా మారింది. ఎప్పటి లాగే.. బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ఎలిమినేషన్, గెస్టులు, గేమ్‌లతో కలర్ ఫుల్ గా సాగిపోయింది. ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆడియెన్స్ కి కావాల్సినంత కిక్ నిచ్చింది.

ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. సండే కావడంతో నాగార్జున వేదికపైకి కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్ వీక్ సమీపిస్తుండడంతో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత దక్కబోతోందో రివీల్ చేశాడు. అక్షరాలా 50 లక్షల నగదు విన్నర్ కి దక్కుతుందని.. వాటితో పాటు ఎక్స్ట్రా బోనాంజాలు ఉన్నాయని ప్రకటించడంతో పాటు గెలిస్తే ఆ మనీని ఏం చేస్తారని ఇంటి సభ్యులని అడిగారు. గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి తమ కుటుంబ సభ్యుల కోసం, తల్లిదండ్రుల కోసం, సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వెచ్చిస్తాం అని బదులిచ్చారు. ప్రశాంత్ రైతుల కోసం వెచ్చిస్తానని చెప్పాడు. ఇక శివాజీ ఇంకా తనదగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవని అన్నారు. అనంతరం బిగ్ బాస్ హౌస్ వేదికపైకి కొందరు సెలెబ్రిటీ గెస్ట్ లు వచ్చారు. ముందుగా నాగార్జున ‘నా సామిరంగ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాక ఆ చిత్రంలో ఆషిక పాత్రని పరిచయం చేసేలా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో ఆషిక అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంటి సభ్యులంతా ఆషికని చూసి థ్రిల్ అయ్యారు. అనంతరం నేచురల్ స్టార్ నాని వేదికపై సందడి చేశారు.

హాయ్ నాన్న చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని బిగ్ బాస్ వేదికపై సందడి చేశాడు. ఆనంతరం సినిమా ముచ్చట్లను నాగ్ తో పంచుకున్నాడు నాని. నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని నాగార్జున.. నాని చేతుల మీదుగా సేవ్ చేయించారు. అనంతరం మరో సేవింగ్ రౌండ్ లో పెద్ద డ్రామానే సాగింది. చివరికి శోభా, గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ప్రీ పాస్ ఉండగా.. వాడుకోకుండా వెనక్కి ఇచ్చేశాడు. తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఫైనల్ గా గౌతమ్, శోభాశెట్టి ఉండగా.. గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్ ఇంటిసభ్యులు ఆట తీరుపై రివ్యూ ఇచ్చాడు. మరి టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలంటే.. మరో రెండు వారాలు ఆగాల్సిందే.