Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్.. ఫైనల్‌ లిస్ట్ ఇదే..

సెప్టెంబర్‌ మూడు నుంచి షో స్టార్ట్ కాబోతుండగా.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఈసారి హౌస్‌కు మొత్తం 20మంది కంటెస్టెంట్లను పంపిస్తారని టాక్ నడుస్తుండగా.. వారి ఎంపిక దాదాపు పూర్తయింది.

  • Written By:
  • Updated On - August 14, 2023 / 05:07 PM IST

Bigg Boss 7: బిగ్‌బాస్‌ 7 ప్రోమో అదరగొట్టింది. ఉల్టాపల్టా అంటూ.. నాగ్ కొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. దీంతో సీజన్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ మూడు నుంచి షో స్టార్ట్ కాబోతుండగా.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఈసారి హౌస్‌కు మొత్తం 20మంది కంటెస్టెంట్లను పంపిస్తారని టాక్ నడుస్తుండగా.. వారి ఎంపిక దాదాపు పూర్తయింది.

కంటెస్టెంట్ల విషయంలో వినిపించిన పేర్లలో చాలావరకు కామన్‌గానే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త పేరు తెరమీదకు వస్తోంది. జబర్దస్త్ నుంచి కమెడియన్ నరేష్‌ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నరేష్‌ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈసారి చాలా మార్పులు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ముందు సీజన్ చూసి.. దానికి తగినట్లు ప్రిపేర్ అయి పక్కా ప్లాన్‌తో కంటెస్టెంట్లు అడుగుపెడుతున్నారు. ఐతే ఈసారి అలాంటివి రిపీట్ కాకుండా.. టాస్కుల నుంచి హౌస్‌లో కండిషన్స్ వరకు చాలా మార్పులు చేయబోతున్నారని టాక్. బిగ్‌బాస్ హౌస్ అంటేనే ఒక అడల్ట్ హౌస్ అంటూ ఇప్పటివరకు బిగ్‌బాస్ గురించి చాలా మంది నెగిటివ్‌గా వార్తలు స్ప్రెడ్ చేశారు. ఐతే ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెట్టడానికి పక్కా ప్లాన్ ప్రకారం రెడీ అవుతున్నరని తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

జబర్దస్త్ నరేష్‌తో పాటు మొగలిరేకులు సీరియల్‌తో భారీ పాపులారిటీ అందుకున్న సాగర్ కూడా ఈసారి హౌస్‌లోకి వస్తారని టాక్. వీళ్లద్దరితో పాటు బుల్లెట్ భాస్కర్, శోభా శెట్టి, విష్ణు ప్రియ, వైష్ణవి చైతన్య, సురేఖ వాణి, నవ్య స్వామి, ఈటీవీ ప్రభాకర్, సింగర్ మోహన భోగరాజు, దుర్గారావు దంపతులు, దీపిక పిల్లి వంటి కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.