బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఫైనల్ గా కెప్టెన్ అవ్వని వాళ్లు ఈసారి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇద్దరిని గన్ దగ్గరకి వెళ్లి ఏ ఒక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించాలో చెప్పి, సరైనా కారణాలతో వారి ఫోటోని ఫైర్ చేయమని చెప్పాడు. దీంతో జంట జంటలుగా వచ్చి ఒక్కొక్కరి ఫోటోలను ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ చివరకి చాలా రసవత్తరంగా మారింది. ముందు నుంచీ శోభాశెట్టి అశ్వినికి మాట ఇచ్చింది. అమర్ తనని కెప్టెన్ చేశాడు కాబట్టి అమర్ ది , నీది ఫోటో వస్తే నేను అమర్ కే సపోర్ట్ చేస్తానని, అలా కాకుండా వేరేవాళ్లది వస్తే మాత్రం నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఇక అశ్విని, రతిక, అమర్ ఈ ముగ్గురే కెప్టెన్ అవ్వలేదు కాబట్టి వీళ్లలో ఒకరిని హౌస్ మేట్స్ కెప్టెన్ చేద్దామని అనుకున్నారు.
Animal: నా భార్య నన్ను కొడుతుంది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
ఈ కెప్టెన్సీ టాస్కులో ముందుగా ప్రియాంక, గౌతమ్ వచ్చి శోభా శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత శోభా, ప్రశాంత్ వచ్చి అశ్వినిని ఔట్ చేశారు. అనంతరం యావర్, రతిక వచ్చి ప్రశాంత్‌ను తీసేశారు. ఆ వెంటనే శివాజి, అశ్విని వచ్చి యావర్‌ను ఔట్ చేశారు. అనంతరం అర్జున్, అమర్ వచ్చి ప్రియాంకను తీశారు. తర్వాత గౌతమ్, రతిక, శివాజిలు కూడా ఎలిమినేట్ అయ్యారు.కానీ చివర్లో గేమ్ లో హైడ్రామా స్టార్ట్ అయ్యింది. శోభాశెట్టి ఇంకా శివాజీ ఇద్దరూ కలిసి అమర్ ఇంకా అర్జున్ ఇద్దరిలో డెసిషన్ తీస్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో శోభాశెట్టి అమర్ కి సపోర్ట్ చేసింది. శివాజీ అర్జున్ వాళ్ల వైఫ్ కి మాట ఇచ్చానని చెప్పి అర్జున్ వైపు మొగ్గాడు. దీంతో ఇద్దరిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. మరోవైపు అమర్ దీప్ చాలా ఎమోషనల్ గా శివాజీని అడుక్కోవడం మొదలు పెట్టాడు. దీంతో శివాజీ అలా అడగద్దని దమ్ముంటే ఫినాలే టిక్కెట్ వస్తుంది అది ఆడి గెలవమని అన్నాడు. అమర్ ఎంతగా బ్రతిమిలాడినా కూడా శివాజీ కరుణించలేదు.
మొదటి నుంచి శివాజీ అమర్ అండ్ బ్యాచ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. వాస్తవానికి కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాక ముందే శివాజి దగ్గరకు వెళ్లిన అమర్.. తనకు సపోర్ట్ చేయాలని అడిగాడు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ, కెప్టెన్సీ టాస్కులో మాత్రం అర్జున్ భార్య ప్రెగ్నెంట్ అని..ఆమె కోసం అతడిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మాటను మార్చేశాడు. ఒకవైపు శివాజీ.. మరోవైపు శోభా శెట్టి తమ నిర్ణయాలపై కట్టుబడి ఉండటంతో ఈ రౌండ్ టై అయింది. దీంతో బిగ్ బాస్ పలుమార్లు వీళ్లను హెచ్చరించాడు. చివరికి ఈ కెప్టెన్సీ టాస్కును రద్దు చేస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు శివాజి కూడా అమర్‌కు సపోర్ట్ చేస్తానని ప్రకటించాడు. కానీ, అప్పటికే అతడి ఫొటోను కూడా కాల్చేసి ట్విస్టునే ఇచ్చాడు.