Nagarjuna: బిగ్‌బాస్ షో.. నాగార్జునను అరెస్ట్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

విన్నర్‌గా బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ.. టైటిల్‌ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే పల్లవిప్రశాంత్‌ ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు.

  • Written By:
  • Updated On - December 20, 2023 / 04:45 PM IST

Nagarjuna: భాషతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్‌లో సూపర్‌హిట్‌ అయిన షో బిగ్‌బాస్‌. తెలుగులో కూడా ఈ రియాలిటీ షోకి దిమ్మతిరిగిపోయే క్రేజ్‌ ఉంటుంది. రీసెంట్‌గానే బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సిరీస్‌ కూడా పూర్తయ్యింది. షో చివరి వరకూ అమర్‌దీప్‌, పల్లవి ప్రశాంత్‌ మధ్య టఫ్‌ గేమ్‌ నడిచింది. కానీ ఫైనల్స్‌లో పల్లవి ప్రశాంత్‌ విన్‌ అయ్యాడు. టైటిల్‌తో బయటికి వచ్చాడు. కానీ ఇక్కడే కథ మొత్తం రివర్స్‌ అయ్యింది.

SALAAR: సలార్ దెబ్బకు బుక్ మై షో సైట్ క్రాష్.. ఇది కదా ప్రభాస్ రేంజ్..

విన్నర్‌గా బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ.. టైటిల్‌ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే పల్లవిప్రశాంత్‌ ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. రన్నరప్‌ అమర్‌దీప్‌ కారు మీద దాడి చేశారు. ఆర్టీసీ బస్‌ అద్దాలు కూడా పగలగొట్టారు. దీంతో కేసు అవుతుందనే భయంతో పల్లవిప్రశాంత్‌ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇదే విషయంలో కింగ్‌ నాగార్జున మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ షో మొత్తానికి కారణమైన నాగార్జునను వెంటనే అరెస్ట్‌ చేశాలంటూ.. అరుణ్‌ అనే అడ్వకేట్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 100 రోజుల పాటు కొందరు వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచి గేమ్‌ ఆడించడం చట్టవిరుద్ధమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎవరు ఎవరితో ఎలా ఆడాలో ముందే చెప్తూ మానసిక హింసకు వాళ్లను గురిచేస్తున్నారంటూ చెప్పారు. ఈ విషయంలో నాగార్జునను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. నాగార్జునతో పాటు బిగ్‌బాస్‌ షోలో ఉన్న మిగిలిన సభ్యులను కూడా విచారించాల్సిన అవసరముందంటూ చెప్పారు. పల్లవి ప్రశాంత్‌ గెలిచిన తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌ ముందు జరిగిన రచ్చకు కూడా బిగ్‌బాస్‌ యాజమాన్యంతో పాటు నాగార్జున బాధ్యత వహించాలంటూ చెప్పారు. మరి అరుణ్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.