Bimbisara: లక్కీ చాన్స్‌ కొట్టేసిన బింభిసారా డైరెక్టర్‌ మెగాస్టార్‌తో మరో సోషియో ఫాంటసీ సినిమా

కళ్యాణ్‌ రామ్‌తో బింభిసార లాంటి మంచి హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ వశిష్ఠ లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. ఏకంగా మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోనే రానున్నట్టు సమాచారం. ఈ స్టోరీని ప్రత్యేకంగా మెగాస్టార్‌ కోసమే రెడీ చేశాడట వశిష్ఠ.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 02:15 PM IST

స్టోరీ కూడా మెగాస్టార్‌కు బాగా నచ్చడంతో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ సినిమా అయినప్పటికే ఎక్కడా బోర్‌ కొట్టకుండా బింభిసారను తెరకెక్కించాడు డైరెక్టర్‌ వశిష్ఠ. సాధారణంగా పురాణాల గురించి పెద్ద అవగాహన లేనివాళ్లకు ఇలాంటి సినిమాలు అర్థం కావు. కానీ నార్మల్‌ ఆడియన్స్‌కు కూడా ఈజీగా స్టరీ రీచ్‌ అయ్యేలా డైరెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. బింభిసార సూపర్‌ హిట్‌ అవ్వడంతో చిరంజీవి కూడా విశిష్ఠను బాగా నమ్మాడట.

నిజానికి అంజి సినిమా తరువాత మెగాస్టార్ సోషియో ఫాంటసీ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజుల తరువాత మరోసారి అలాంటి స్టోరీ మళ్లీ ప్లాన్‌ చేస్తున్నారని తెలియడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ కుషీ అవుతున్నారు. ప్రస్తుతం భోళాశంకర్‌ సినిమా షూటింగ్‌లో మెగాస్టార్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ స్టోరీలో కొన్ని చేంజెస్‌ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్‌ కాస్త లేట్‌ అయ్యిందట. ఈ గ్యాప్‌లో మెగాస్టార్‌ కొత్త స్టోరీలు వింటున్నాడు. ఇందులో భాగంగానే వశిష్ఠ చెప్పిన కథకు మెగాస్టార్‌ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.