నందమూరి అభిమానులకు జోష్ నింపేందుకు బింబిసార 2 ప్రీక్వెల్ ను రూపొందిస్తున్నట్లు కళ్యాణ్ రామ్ తాజాగా ప్రకటించారు. ఈ వార్తతో తమ అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైందని చెప్పాలి. ఎందకుకంటే ప్రస్తుతం అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరో ఇప్పటికే ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్ లతో ఫ్యాన్స్ మధ్య తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో బింబిసార 2కు సంబంధించిన వార్త బయటకు రావడంతో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి.
చాలా కాలం తరువాత హిట్:
నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తరువాత చాల మంది హీరోలుగా సినీ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది మాత్రం జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. అయితే కళ్యాణ్ రామ్ కూడా చాలా ప్రయోగాత్మక సినిమాలు చేసినప్పటికీ చాలాకాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ ను బింబిసార సినిమాతో అందుకున్నారు. ఆ కథ తారక్ కి వచ్చిఉంటే ఇంకో రేంజ్ లో ఆడిఉండేది అనే టాక్ కూడా ప్రేక్షకుల్లో వినిపించింది. ఏది ఏమైనా బింబిసార హ్యాంగ్ ఓవర్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి అమిగోస్ సినిమా ఆ కిక్ ను పెంచుతుందా లేక దించుతుందో చూడాలంటే ఫిబ్రవరి 10వరకూ వేచిఉండాల్సిందే.
మెల్లగా మొదలైన కలెక్షన్ల వర్షం:
2022 ఆగస్ట్ లో బింబిసార చిత్రంతో కమర్షియల్ హిట్ సాధించారు. విడుదలైన మొదటిరోజు నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో కొన్ని సంవత్సరాల తరువాత భారీ విజయాన్ని అందుకున్నారనే చెప్పాలి. అలాగే కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్లోనే పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలైన తొలివారంలోనే లాభాల బాట పట్టింది. అంతేకాకుండా చివరి వారంలో కూడా దాదాపు 70కోట్ల రూపాయలు రాబట్టగలిగింది.
కళ్యాణ్ రామ్ తాజా ప్రకటన:
ప్రస్తుతం వచ్చిన మూవీ అప్డేట్ ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కళ్యాణ్ రామ్ తాజాగా ప్రకటించారు. బింబిసార-2 సినిమా చిత్రీకరణను ఈ సంవత్సరం ఆఖర్లో ప్రారంభిస్తామని తెలిపాడు. ఈ వార్త తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
కథకు బీజం ఏంటి:
సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయానికొస్తే.. అసలు బింబిసారుడు ఎవరు..? తన సొంత తమ్ముడిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మంచిగా పాలిస్తున్న రాజు ఇలా ప్రతినాయకుడిగా మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? బాల్యం నుంచి తన జీవితం ఎలా సాగింది..? అనే ప్రశ్నల ఆధారంగా కథను రూపొందించనున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సారి మరింత అద్భుతమైన విజువలైజేషన్స్ తో.. రిచ్ లుక్ లో విజువల్ వండర్గా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించాలని చూస్తున్నారు.