తిట్టారు, నవ్వారు, ఇప్పుడు ఏడుస్తున్నారు.. కొండంత ఇమేజ్ అక్కడ…

త్రిబుల్ ఆర్ మూవీ విడుదలైన కొత్తలో ఎన్టీఆర్ ని చూసిన, నార్త్ ఇండియాలో కొందరు నవ్వారు. ఇంకొందరు తిట్టాడు. ఓ బ్యాచ్ అయితే తన లుక్ ని కూడా తక్కువ చేసి మాట్లాడింది.

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 12:54 PM IST

త్రిబుల్ ఆర్ మూవీ విడుదలైన కొత్తలో ఎన్టీఆర్ ని చూసిన, నార్త్ ఇండియాలో కొందరు నవ్వారు. ఇంకొందరు తిట్టాడు. ఓ బ్యాచ్ అయితే తన లుక్ ని కూడా తక్కువ చేసి మాట్లాడింది. కాని త్రిబుల్ ఆర్ లో కొమరం భీముడి పెర్ఫామెన్స్ కి బాక్సాఫీస్ తో పాటు కామన్ ఆడియన్స్ ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఫిదా అయ్యారు. కట్ చేస్తే దేవర గా వచ్చాక ఆ లెక్కలు మతిపోగొట్టాయి. ఆ స్టేజ్ నుంచి ఈస్టేజ్ కి కాదు, అంతకుమించే స్టేజ్ కి వెళుతున్నాడు ఎన్టీఆర్. పదేళ్లుగా పాన్ ఇండియా కింగ్ అయిన ప్రభాస్ నే మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విషయంలో ఒకే ఒక్క విషయంలో మాస్ మంత్రంతో మాయచేసిన తాను, ఆ మంత్రమేంటో మాత్రం రివీల్ కానియట్లేదు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ని కాపాడిన ఫార్ములానే ఇప్పుడు ఎన్టీఆర్ ని శిఖరంగా మారుస్తోంది.. ఇంతకా సీక్రెట్ ఏంటి?

ఎన్టీఆర్ ఎదుగుదలని చూసి, లేదంటే తనకి ఇంత మార్కెట్ ఏంటనే కుళ్లుతో నార్త్ ఇండియాలో చాలా మంది ఎగతాలి చేసినవాళ్ళున్నారు. అదంతా రెండేల్ల క్రితం మాట… తన పెర్పామెన్స, మాస్ ఫాలోయింగ్ తెలియని నార్త్ ఇండియా జనం త్రిబుల్ ఆర్ రిలీజ్ కిముందు చాలా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఖాన్లు, కపూర్లని కూడా క్రిటిసైజ్ చేయకుండా ఉండని, కే ఆర్ కే అనే క్రిటిక్ అయితే, ఎన్టీఆర్ ని ఎలుగుబంటితో పోల్చాడు

హీరో అంటే ఆరడుగులుండాలి, ఆలుక్కే వేరని ఎన్టీఆర్ మీద బురద చల్లాడు. ఇలాంటి కామెంట్లు సౌత్ హీరోలని తక్కువ చేయాలనుకునే కొందరు నార్త్ ఇండియన్ బ్యాచ్ కి సమ్మగా అనిపించొచ్చు.. కాని కటౌట్ లో దమ్ముంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుందనే కామన్ సెన్స్ వాళ్లకు లేకుండా పోయింది

ఆరడుగులు హైటు, సిక్స్ ప్యాక్స్ ఇవన్నీ ఉన్నా మోడల్స్ మాస్ హీరోలయ్యారా? అప్పియరెన్స్ కొంతవరకు మ్యాటరే కావొచ్చు కాని, మ్యాటరే అప్పియరెన్స్ గా పెట్టుకున్న ఎన్టీఆర్ కి లుక్స్ డజెంట్ మ్యాటర్… అదే తెలుగులో రుజువైంది. తర్వాత పాన్ ఇండియా లెవల్లో, త్రిబుల్ ఆర్, దేవరతో రెండు సార్లు తనేంటో తెలిసింది.

ఇప్పుడు తెలియాల్సింది… ఎన్టీఆర్ వేసిన మాస్ మంత్రం… ప్రభాస్ కి సౌత్, నార్త్ అని తేడా లేకుండా కోట్లల్లో అభిమానులున్నారు. మాస్ ఫాలోయింగ్ భీబత్సం.. కాని ఊరమాస్ వరకు రీచైన సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇద్దరే ఇద్దరు హిస్టరీ క్రియేట్ చేశారు అది అప్పట్లో రజినీకాంత్. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్

అమితాబ్ మాస్ హీరోగా దూసుకెళుతున్న టైంలో, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు నార్త్ ఇండియాలో రీక్షావాల నుంచి మజ్దూర్ వరకు అందరికి తెలుసు.. అచ్చంగా అలాంటి రోజులు ఇప్పుడొచ్చాయి. త్రిబుల్ ఆర్ లో భీముడిగా కనిపించిన తారక్, దేవరలో ఊర మాస్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యాడు

ఆపాత్రలుక్కో లేదంటే తారక్ పెర్పామెన్స్ లో కిక్కో కాని, తనని నార్త్ ఇండియా లోని రూరల్ ఏరియాల్లోకి కూడా చొచ్చుకెళ్లేలా చేసింది. ఇదే ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందంటే, రాజస్తాన్ లోని సెలూన్లు, హర్యాణ, బీహార్ లోని సెలూన్లలో ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోలు కామన్ గా కనిపిస్తున్నాయి. చత్తీస్ ఘడ్, మధ్య ప్రధేశ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లోని రూరల్ ఏరియాల్లో కటింగ్ సెలూన్స్, ఆటోరిక్షాల వెనకాల ఎన్టీఆర్ ఫోటోలు కనిపించడం చూస్తుంటే, ఎక్కడి నుంచి ఎంతవరకు తారక్ పేరు దూసుకెళ్లిందో… దీనంతటికి కారణం మాస్ కి ఎన్టీఆర్ తాలూకు ఏదో అంశం తెగనచ్చటం.. పుష్పరాజ్ లాంటి ఊర మాస్ పాత్ర వేసినా బన్నీకి రాని గుర్తింపు దేవరతో ఎన్టీఆర్ కి దక్కడమే వింత.