TOLLYWOOD: టైమొచ్చింది.. బాలీవుడ్‌ను ఏలే ఛాన్స్

తెలుగు హీరోలు నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. కావాలని నెగెటివిటిని ప్రచారం చేస్తూ వచ్చారు కొందరు బాలీవుడ్ బ్యాడ్ బాయ్స్. బీటౌన్‌ను మించిపోతోందని, టాలీవుడ్ దూకుడుకు బ్రేక్ వేయాలని ఇప్పటికీ శతవిధాల ప్రయత్నిస్తున్నారు

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 03:42 PM IST

TOLLYWOOD: బాహుబలి తర్వాత టాలీవుడ్ అంటే బాలీవుడ్‌కు ఎంత కంటగింపుగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోలు నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. కావాలని నెగెటివిటిని ప్రచారం చేస్తూ వచ్చారు కొందరు బాలీవుడ్ బ్యాడ్ బాయ్స్. బీటౌన్‌ను మించిపోతోందని, టాలీవుడ్ దూకుడుకు బ్రేక్ వేయాలని ఇప్పటికీ శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

Kalki 2898 Ad Release Date : కల్కి రిలీజ్‌ రూమర్లకు చెక్…

అయితే ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు.. బీటౌన్ లో ఏదో ఒక మూవీ అడ్డొచ్చింది. సేమ్ టైంలో రిలీజ్ కావడం ఇబ్బందిపెట్టింది. కానీ అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్టులకు అలాంటి సమస్య నుంచి విముక్తి దొరకబోతుండటం ఆసక్తిగా మారింది. టాలీవుడ్‌లో త్వరలో రిలీజ్ లైనప్‌లో ఉన్న మూవీలు కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ చేంజర్, ఓటీ. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. పక్కగా పాన్ ఇండియా సినిమాలే. దీంతో ఈ నాలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం కోసం హిందీ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఎలాగైనా రైట్స్ తమపరం చేసుకునేందుకు ముఖ్యమైనవాళ్లు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాను కరణ్ జోహార్ హిందీలో విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే మిగిలిన వాటి కోసం కూడా ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి స్టార్‌ల సినిమాలున్నా వాటి బజ్ అంతంతమాత్రమే. దీంతో అందరికన్ను సౌత్ సినిమాలపై పడింది.

ఎలాగైనా సౌత్ సినిమాలను కొనేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఈ సమయంలో విడుదలయ్యే సినిమాలకు బీటౌన్‌లో భారీగా థియేటర్స్ లభించటంతోపాటు, మ్యాగ్జిమమ్ ఓపెనింగ్స్ రావటానికి అవకాశముంది. గతంలో బాహుబలి, కేజిఎఫ్ సిరీస్ సినిమాల విడుదల టైమ్‌లో ధియేటర్స్ కలిసి వచ్చినట్లే ఈసారి పాజిటివ్ అంశాలు కలిసొస్తున్నాయి. చూడాలి మరి ఈ గ్యాప్‌ను సౌత్ ఇండస్ట్రీ ఎలా క్యాష్ చేసుకుంటుందో.