Allu Arjun: పుష్ప-2లో మరో బాలీవుడ్‌ హీరో.. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సుకుమార్‌..

సెలబ్రెటీల జీవితాలు.. అందులోనూ ముఖ్యంగా ఫిలిం మేకర్స్‌ జీవితాలు చూసేందుకు కలర్‌ఫుల్‌గానే ఉంటాయి. కానీ హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసే టైం కానీ.. ఫ్రెండ్స్‌తో చిల్‌ కొట్టే టైం కానీ వాళ్లకు దాదాపుగా ఉండదు.

షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పే వరకే యాక్టర్స్‌కు పని. కానీ డైరెక్టర్స్‌కు మాత్రం ఆన్‌ ది సెట్స్, ఆఫ్‌ ది సెట్స్‌ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే దాకా ప్రశాంతంగా రెస్ట్‌ తీసుకునే టైం మాత్రం ఉండదు. దొరికిన కాస్త టైంలోనే వాళ్లు ఎంజాయ్‌ చేయాలి. ఇప్పుడు లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కూడా అదే పని చేస్తున్నాడు. పుష్ప-2 షెడ్యూల్‌కు కాస్త బ్రేక్‌ రావడంతో తన సొంతూరు అమలాపురానికి మకాం మార్చేశాడు.

తన అక్క కూతురి ఫంక్షన్‌ ఉండటంతో షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అలా ఇంటికి వచ్చాడో లేదో ఫ్రెండ్స్‌తో చిల్‌ కొడుతున్నాడు. ఊర్లో చిన్ననాటి స్నేహితులను కలుస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో జాలీగా గడుపుతున్నాడు. పనిలో పనిగా పుష్ప-2 గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు సుకుమార్‌. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను మారేడుమిల్లిలో షూట్‌ చేయబోతున్నట్టు చెప్పాడు. ఈ షెడ్యూల్‌లో విలన్‌కు పుష్పరాజ్‌కు మధ్య సీన్స్‌ ఉంటాయని చెప్పాడు.

ఈ నెల 27 నుంచి 29 వరకూ మూవీ యూనిట్‌ మొత్తం మారేడ్‌మిల్లి షిఫ్ట్‌ చేస్తామని చెప్పాడు. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన రోల్‌ మరింత హైలెట్ కానుందట. పుష్ప రాజ్‌ను ఇంట్రొడ్యూస్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా రణ్‌వీర్‌ కనిపించనున్నారని టాక్. ఇదే నిజమైతే వీల్లిద్దరి స్క్రీన్‌ షేరింగ్‌ నెక్స్ట్‌ లెవెల్‌లో ఉండబోతోందంటున్నారు ఫ్యాన్స్‌.