BOLLYWOOD: పఠాన్, జవాన్ మూవీలతో బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయింది. మరికొన్ని సినిమాలు కూడా హిట్ అవ్వడంతో నార్త్ మేకర్స్‌లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. కానీ బాలీవుడ్ పూర్తిగా స్ట్రీమ్ లైన్ అయిందని చెప్పలేకపోతున్నారు. కారణం.. ఇటీవలి కొన్ని సినిమాలు కనీస ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయాయి. దీంతో టైగర్ 3, యానిమల్ మూవీలు హిట్ కావడం బాలీవుడ్ భవిషత్తుకి కీలకంగా మారింది. ఈ రెండు సినిమాలపై భారీ హోప్స్ పెట్టుకున్నారు బాలీవుడ్ మేకర్స్.
కరోనా కారణంగా కుదేలైన బాలీవుడ్‌కి 2023 కలిసొచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో రిలీజైన పఠాన్, ఆ తర్వాత వచ్చిన జవాన్ వెయ్యేసి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. రొమాంటిక్ జానర్‌లో వచ్చిన తూ ఝూథీ మైన్ మక్కార్, జరా హాట్కే జరా బచ్కే, సత్యప్రేమ్ కి కథ, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, ఓ మై గాడ్ 2, గదర్ 2 సినిమాలు హిట్ అవ్వడంతో బాలీవుడ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఐతే ఇదే ఊపులో రాబోయే 2 నెలలు కొనసాగితే బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయినట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దీంతో నవంబర్, డిసెంబర్‌లో రిలీజయ్యే టైగర్ 3, యానిమల్ మూవీలపై భారీ హోప్స్ పెట్టుకున్నారు నార్త్ మేకర్స్. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 నవంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుంది. దానికి తగ్గటే ట్రైలర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఫైట్స్, డైలాగ్స్ బాగున్నా.. ఈ ప్రాజెక్ట్ పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ స్ప్రెడ్ అవుతోంది. యష్ రాజ్ ఫిలిం మేకర్స్ ఒకే కథను తిప్పి తిప్పి తీస్తున్నారని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.
పది నెలల గ్యాప్‌లో రెండుసార్లు ఒకే జానర్ కథను చూపించాలనుకోవడం రిస్కని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా.. ఇక్కడ సల్మాన్ ఇమేజ్ కీలకం. మొదటి రోజు కండల వీరుడు జనాన్ని రప్పించగలడు. కానీ ఆ తర్వాత నిలబెట్టాల్సింది టాకే. సినిమాలో దమ్ముంటే జనాలు థీయేటర్స్‌కి క్యూ కడతారు. రూ.1000 కోట్లు వసూళ్లు చేసే ఛాన్స్ దక్కుతుంది. బాలీవుడ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌పై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే.. ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో హైప్ తీసుకొచ్చాయి.
ముఖ్యంగా రణబీర్, రష్మిక మధ్య లిప్ లాక్ సీన్స్ చూసి మరోసారి అర్జున్ రెడ్డిని చూపిస్తారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయ్. కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా డిసెంబర్ 1న నేషనల్ వైడ్‌గా యానిమల్ ప్రభంజనం షురూ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి నవంబర్, డిసెంబర్‌లో వచ్చే ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ కంప్లీట్‌గా గాడిన పడినట్టే. ఏ మాత్రం తెడా కొట్టినా సలార్, పుష్ప2, దేవర, కల్కి సినిమాలు ఆ ఫ్లేస్‌ని కబ్జా చేసే ఛాన్స్ ఉంది.