ANIMAL: టాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా అనేంతగా బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప, త్రిబుల్ ఆర్, మేజర్, కార్తికేయ 2.. ఇలా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలన్నీ లెక్కలు మార్చాయి. జక్కన్న, సుకుమార్ వల్ల టాలీవుడ్ రేంజే పెరిగిపోయింది. గతంలో తెలుగు సినిమాలు హిందీ ఆడియన్స్‌కి డబ్బింగ్ రూపంలో పరిచయం కావటం, యూట్యూబ్‌లో సందడి చేయటం, ఆ తర్వాత మన కంటెంట్‌కి నార్త్‌లో డిమాండ్ ఉందనటం ఇవన్నీ.. టాలీవుడ్ విజయాలు.
Dunki VS Salaar: నార్త్ ఇండియాలో సలార్‌కు డంకీతో చుక్కలేనా..?
కట్ చేస్తే అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు రివర్స్‌లో నడుస్తోంది. బాలీవుడ్‌లో సరుకులేని దర్శక రచయితల వల్ల అక్కడి ఆడియన్స్‌కి నచ్చే కంటెంట్ వాళ్లు ఇవ్వలేకపోయారు. అందుకే సౌత్ వైపు.. ముఖ్యంగా టాలీవుడ్ వైపు ఆతృతగా చూశారు. ఇప్పుడు తెలుగు జనమే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బాలీవుడ్ వైపు చూస్తున్నారా..? ఇదే జరుగుతోంది. పటాన్‌తో అదే జరిగింది. జవాన్ టాలీవుడ్‌లో రూ.11 కోట్లపైనే ఓపెనింగ్స్ రాబట్టడంతో అదే తేలింది. ఇక యానిమల్ ఎంత తెలుగు దర్శకుడు తీసినా.. అది హిందీ మూవీనే కాబట్టి అలా కూడా బాలీవుడ్ హవా పెరుగుతోంది.
డంకీ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎదురు చూడటమే ఇందుకు మంచి ఉదాహరణగా మారింది. జస్ట్ ఐదారేళ్లలో సీన్ మొత్తం రివర్స్ అవటం చూస్తే, మన దర్శక రచయితలు అతివిశ్వాసంతో, మళ్లీ పాతకాలంలోకి వెళుతున్నారనే కామెంట్స్ పెరిగాయి.