ఎన్టీఆర్ దేవర మూవీ వసూళ్ల మీద స్కామ్ అంటూ కుట్ర కామెంట్స్ పెరిగాయని మీకు తెలుసా… టాలీవుడ్ లో ఓ సినిమా పాన్ ఇండియాని షేక్ చేయబోతోందంటే, కుట్రలాంటి కత్తులతో దాడికి యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ రెడీ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాసే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే కూడా ఆ బ్యాచ్ కి ఎందుకో కసి తీర దాడి చేసేంత పగ… త్రిబుల్ ఆర్ వచ్చినప్పుడు అదే కుల్లుతో ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు. అది హిట్ అయ్యాక నోరు మూసుకున్నారు. కట్ చేస్తే మల్టీ స్టారర్ కాకుండా, ఈ సారి ఏకంగా సోలోగా పాన్ ఇండియా మీద దాడి చేశాడు ఎన్టీఆర్. అయినా ఈ సారి కూడా దాడి చేస్తున్నారు. అది కూడా హిట్ అని తెలిశాక… ఇప్పుడు యూఎస్ వసూళ్ల మీద స్కామ్ అంటూ పిచ్చి పిచ్చి మాటల దాడి జరుగుతోంది. ఇంతకి ఈ మాటల తూటాలు ఇంకెంతకాలం… ఎన్ని హిట్లు పడ్డా యాంటీ ఫ్యాన్స్ మారరా?
దేవర ఓపెనింగ్స్ చూసి, బాలీవుడ్ జనాలకే కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. యూఎస్ లో ప్రివ్యూ, ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలిపితే 40 కోట్లని తేలటంతో అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి టైంలో బాలీవుడ్ మీడియా దేవర మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నట్టుంది. దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ వెనక స్కామ్ అంటూ కామెంట్లు, నెగెటీవ్ ప్రచారం షురూ చేసింది
రిలీజ్ కిముందు యాంటీఫ్యాన్స్ దేవర పాటల్ని కాపీ అని, బాలేదని ఏవేవో కామెంట్లు, ట్రోలింగ్స్ చేశారు. ట్రైలర్ వస్తే, షార్క్ స్వారీ మీద ట్రోలింగ్స్ తో కుళ్లుకున్నారు. అయినా మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుని, పాటలు, ట్రైలర్ లోని మాటలు వైరలయ్యాయి. సో అలా దేవర హైప్ ని కంట్రోల్ చేయలేకపోయిన యాంటీ ఫ్యాన్స్, ఇప్పుడు పనికట్టుకుని దేవర వసూళ్ల మీద బురద చల్లే పని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే అమెరికాలో చాలా టిక్కెట్లు కొన్నది నిర్మాతే అన్నది వాళ్ల ప్రచారంలో మొదటి లైన్
బేసిగ్గా ఏ థియేటర్స్ లో దేవర ఆడుతుందో, ఆ ఎగ్జిబిటర్ కి టిక్కెట్ లో 40 శాతం తనకి, మిగతా 60 శాతం దేవర నిర్మాతకి దక్కుతుంది. సో మొత్తం టిక్కెట్లే నిర్మాత కొంటే, ఎలాగూ అందులో 60 శాతం ప్రొడ్యూసర్ కే వెళ్లే ఎమౌంట్ కాబట్టి, కేవలం 40శాతం నష్టాపోతాడు.. కాని సినిమా ఫస్ట్ డే హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తే
సినిమాకెంత డిమాండ్ ఉందో అన్న కోణంలో, జనంలో వేలం వెర్రి పెరుగుతుంది.. అందుకే నిర్మాత ఇలా చేస్తున్నాడనేది, నెగెటీవ్ ప్రచారంలో భాగంగా కుల్లుని కుట్రని స్ప్రెడ్ చేస్తున్నారు
విచిత్రం ఈ కల్చర్ ఎక్కువగా ఉంది బాలీవుడ్ లో.. అక్కడ ఓ సినిమా రిలీజ్ అయితే, కార్పోరేట్ బుక్కింగ్స్ అని, ఏదో కంపెనీ ఎంప్లాయ్స్ కోసం నిర్మాతే టిక్కెట్స్ కొంటాడు.. అప్పుడు ఆన్ లైన్ లో టిక్కెట్లు ఉండవు.. దీంతో జనాలు ఈ సినిమాకు క్రేజ్ ఉందనుకుంటారు. ఫలితంగా హైప్ పెరుగుతుంది. ఇది ఓ స్కామ్ స్ట్రాటజీ… దీనివల్ల నిర్మాత చేబుకి చిల్లే కాని, ఇలా సినిమాను మొదటి రెండు మూడు రోజులు పుష్ చేస్తే, తర్వాత జనాలు క్యూకడతారనేది ఓ మార్కెటింగ్ స్ట్రాటజీ
కాని ఇలాంటి దిక్కుమాలిన స్ట్రాటజీలు తెలుగు నిర్మాతలు ఫాలో అయితే, బాలీవుడ్ లానే టాలీవుడ్ కూడా ఎప్పుడో బక్కెట్ తన్నేసేసింది. ఇలాంటి పనులు చేసే హిందీ సినిమా మునిగిపోయింది. కుప్పకూలిపోయింది. సో అక్కడి వాళ్లలానే తెలుగు బ్యాచ్ చేస్తుందనే కోణంలో దేవర కలెక్సన్స్ మీద కామెంట్లతో బురద చల్లే పనులు జరుగుతున్నాయి. ఆడని సినిమాను కూడా లెక్కు మించి థియేటర్స్ లో ఆడించిన రోజులు కూడా టాలీవుడ్ లో ఉన్నాయి.
కాని ఇప్పుడెవరైనాఎక్కువ థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడించాలనుకుంటున్నారా? లేనే లేదు. అలా ఏవి ఆడట్లేదు. ఎంత గొప్ప సినిమా అయినా 30 నుంచి 50 రోజులు ఆడుతుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది… కాబట్టి దేవర వసూళ్ల మీదొస్తున్న స్కామ్ కామెంట్లకి, కలెక్సన్లే కౌంటర్ ఇస్తాయి.. ఎలాగైతే దేవర రిలీజ్ కి ముందు ఏం చేసినా హైప్ ని తగ్గించలేకపోయారు. ఇప్పుడు రిలీజ్ అయ్యాక కూడా ఏదో చేద్దామన్న కుదిరేలా లేదు… వసూళ్లే అలా వాయించేస్తున్నాయి.