పుష్ప మింగుతాడని భయమా…?బాలీవుడ్ స్టార్ హీరో మూవీ పోస్ట్ పోన్

ఇండియా వైడ్ గా పుష్ప ది రూల్ మేనియా పీక్స్ లో ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకో వారం కూడా లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు బాలీవుడ్ లో కూడా హాట్ బీట్ పెరిగిపోతోంది.

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 08:03 PM IST

ఇండియా వైడ్ గా పుష్ప ది రూల్ మేనియా పీక్స్ లో ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకో వారం కూడా లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు బాలీవుడ్ లో కూడా హాట్ బీట్ పెరిగిపోతోంది. సినిమా ప్రమోషన్స్ నార్త్ లో కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా భయపడే పరిస్థితి. అక్కడి స్టార్ హీరోలు కూడా పుష్ప గ్రాండ్ రిలీజ్ చూసి భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియా సినిమా కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు. ఏ సౌత్ సినిమా నార్త్ లో ఈ రేంజ్ లో ప్రమోషన్ చేయలేదు.

నాలుగు ఈవెంట్స్ జరిగితే… నాలుగు సూపర్ హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కూడా పుష్ప ది రూల్ ను చూసి లెసన్స్ నేర్చుకోవాలి అంటూ అక్కడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప గురించి ఏ అప్డేట్ వచ్చినా నార్త్ ఆడియన్స్ కూడా పిచ్చి ఎక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో పుష్ప క్రేజ్ నార్త్ లో ఓ రేంజ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో పుష్ప సినిమా దెబ్బకు తన సినిమాను వాయిదా వేసాడు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కావడంతో అసలు ఎదురు వెళ్ళే సాహసం చేయడం లేదు.

విక్కి కౌశల్ హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న చావా సినిమాను వాయిదా వేసారు మేకర్స్. ముందు డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. కాని పుష్ప 2 మేనియా భయపెట్టడం, ఇండియా వైడ్ గా దాదాపు 12 వేల స్క్రీన్స్ లో రిలీజ్ కావడంతో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఛావా ఇప్పుడు ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ లో, ఛావా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. 19 ఫిబ్రవరి 2025 (sic)న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విడుదల తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ పోస్ట్ చేసాడు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటీ అంటే… రెండు చిత్రాలలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్‌లో ముందుగా, మేకర్స్ ఛావా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహరాజ్‌గా కనిపించనున్నాడు. విక్కీ కౌశల్‌తో పాటు రష్మిక మందన్న మరియు అక్షయ్ ఖన్నా కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా ఓ మరాఠి నవల ఆధారంగా తెరకెక్కించారు.