Emergency Movie కంగనా రనౌత్ నటించిన “ఎమర్జెన్సీ” చిత్రం వాయిదా పై రాజకీయ కోణం ఉందా.. ?

తాజాగ తన తదుపరి చిత్రం గురించి కంగనా ఓ అప్డేట్ ఇచ్చింది. కంగనా రనౌత్ గతంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించింది. ఇప్పుడు యావత్ దేశం చూపు తనవైపు కు తిప్పుకునేందుకు కంగనా మరో రాజకీయ చిత్రం చేస్తుంది. అదే ఎమర్జేన్సీ. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

కంగనా రనౌత్ బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు భారత రాజకీయాల్లో కూడా ఆమె పేరు తెలియని వారు ఉండరు. నిజానికి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో చాలా వరకు కంగనా తో మాట్లాడాలంటే భయపడతారు. రాజకీయ నాయకులు కూడా కంగనా తో మాట్లాడాలి అంటే జంకుతారు. ఇటీవలే కంగనా రనౌత్ చంద్రముఖి-2 సినిమాలో నత నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో చంద్రముఖి గా సెట్ అయినప్పటికి ప్రేక్షకులను మాత్రం చంద్రముఖి-2 ఆశించిన స్థాయిలో థియేటర్లలో మెప్పించలేకపోయింది.

తాజాగ తన తదుపరి చిత్రం గురించి కంగనా ఓ అప్డేట్ ఇచ్చింది. కంగనా రనౌత్ గతంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించింది. ఇప్పుడు యావత్ దేశం చూపు తనవైపు కు తిప్పుకునేందుకు కంగనా మరో రాజకీయ చిత్రం చేస్తుంది. అదే ఎమర్జేన్సీ. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన కంగనా ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ లుక్ తో ఎమర్జెన్సీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ చిత్రం ఈ సంవత్సరం నవంబర్ లో 24న విడుదలవుతుంది అని గతంలో చెప్పిన కంగనా ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పింది.

చిత్రం వాయిదా కు గల కారణం ఏంటి..?

‘డియర్‌ ఫ్రెండ్స్‌. ఎమర్జెన్సీ సినిమా గురించి ఒక ముఖ్యమైన ప్రకటనను మీ అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను. ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్‌ సమయంలో ఓ నటిగా తానెంతో నేర్చుకున్నాను. ఆర్థికంగా కూడా ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకున్నాను. ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, నా విలువలకు, పాత్రకు పరీక్ష. ఈ మూవీ టీజ‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌, నాలో మరింత ప్రోస్తహన్ని ఇచ్చింది. ఇందుకు మీకు కృతజ్ఞతలు. అయితే నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. మేము ఇంతకు ముందు ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ప్రకటించాం. కానీ నేను నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2024 చివరి వరకు నా మూవీస్‌ వరుసగా విడుదలవుతాయి. అందుకే ఎమర్జెన్సీ సినిమాను కూడా 2024కు వాయిదా వేస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ అందరూ ఇందుకు సహకరించాలని కోరుకుంటున్నా. మీ ప్రేమాభిమానాలు మాపై ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేసింది కంగన.

“ఎమర్జెన్సీ” వాయిదా లో రాజకీయ కోణం ఉందా.. ?

ఎమర్జెన్సీ సినిమా అనేది జూన్ 12, 1975 – మార్చి 21, 1977 వరకు భారత దేశంకు స్వాతంత్య్రం వచ్చాక 21 నెలలు ఇందిరాగాంధీ పాలనలో చీకటి ఉంది.ఆనాటి పరిస్థితులను ఈ తరం వాళ్లకు తెలియదు. మరొకటి ఏమిటంటే ఈ సినిమా కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకం గా ఉండబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే చిత్రం టైటిలే ఎమర్జెన్సీ కావున ఇందులో ఇందిరాగాందీ ప్రకటించిన ఎమర్జెన్సీ ఎలా విధించారు.. దీని ద్వారా ప్రజలు ఎలా అవస్థలు పడ్డారు అని స్పష్టంగా చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా వాయిదా పడడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ చిత్రం ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం లోక్ సభ ఎన్నికల ముందు ఈ చిత్రం విడుదల చేస్తే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గొచ్చని.. బీజేపీకి కాస్త మైలేజ్ రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. పైగా చిత్రాన్ని స్వయంగా కంగనా రౌనత్ దర్శకత్వం వహించడంతో చిత్రం వాయిదా పై మరింత రాజకీయ అనుమాలనకు తావు ఇస్తుంది.

అసలు ఏంటి ఈ ఎమర్జెన్సీ..?

భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని అతి పెద్ద తప్పిదం. ఇందిరా గాంధీ జైలు నుంచి బయటకు వచ్చి తన రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరాగాంధీ తీసుకున్న నియంత్రణ పాలన , ప్రజాస్వామ్య లో జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.

జూన్ 12, 1975 నాటి అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని మరియు ఆమెను ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించకుండా నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు అత్యవసర పరిస్థితిని విధించడానికి దారితీసిన అంశాలలో ఒకటి. జూన్ 25, 1975 నుండి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి అన్ని ప్రాథమిక హక్కులను నిలిపివేసి, విపక్ష నాయకులకు చుక్కులు చూపించింది. . జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్ పేయి, మొరార్జీ దేశాయ్, ఎల్ కే అద్వానీ వంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సహ.. దేశవ్యాప్తంగా వివిద నాయకులను, మీడియాపై సెన్సార్‌షిప్ విధించి సీనియర్ జర్నలిస్టులను, 11 లక్షల మందిని జైళ్లలో నిర్బంధించారు.

S.SURESH