బాలీవుడ్ కి రెబల్ సాయం… ప్రభాస్ లేకుండా కష్టం..

రెబల్ స్టార్ నుంచి అప్ డేట్స్ ఆగిపోయాయి. ఇదే టైంలో దేవర దరువు పెరిగిపోయింది. దీంతో ఇక ప్రభాస్ సౌండ్ లేదనుకున్నారు. కట్ చేస్తే, పాన్ ఇండియా కింగ్ లేందే బాలీవుడ్ కి రోజు గడిచేలా లేదు. అర్జెంట్ గా ప్రభాస్ వచ్చి సాయం చేయాలంటూ కరణ్ జోహార్, టీసీరీస్ టీం హెల్ప్ కోరుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 1, 2024 / 10:59 AM IST

రెబల్ స్టార్ నుంచి అప్ డేట్స్ ఆగిపోయాయి. ఇదే టైంలో దేవర దరువు పెరిగిపోయింది. దీంతో ఇక ప్రభాస్ సౌండ్ లేదనుకున్నారు. కట్ చేస్తే, పాన్ ఇండియా కింగ్ లేందే బాలీవుడ్ కి రోజు గడిచేలా లేదు. అర్జెంట్ గా ప్రభాస్ వచ్చి సాయం చేయాలంటూ కరణ్ జోహార్, టీసీరీస్ టీం హెల్ప్ కోరుతున్నాయి. సలార్, కల్కీ హిట్ల తర్వాత ఫౌజీ తోపాటు రాజా సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు రెబల్ స్టార్. అలాంటి తన కోసం కొండంత గొడ్డలి రెడీ చేస్తోంది బాలీవుడ్ టీం. ఆ గొడ్డలి డిజైన్ కూడా రాజమౌలి సలహాతోనే రెడీ చేయిస్తున్నారట. ఇంతకి బాలీవుడ్ బాక్సాఫీస్ ని గొడ్డలితో నరికేంత అవసరం ఏమొచ్చింది? రెబల్ స్టార్ చేతికి గొడ్డలిచ్చి బాలీవుడ్ ఏరకంగా రెబల్ స్టార్ సాయం కోరుతోంది?

బాలీవుడ్ ఇప్పుడు రెబల్ స్టార్ కోసం గొడ్డలి తయారు చేయించి మరి, వెల్ కమ్ చెబుతోంది. దాని వెనక భారీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది.. నిజానికి ఎన్టీఆర్ సినిమా మీద ఏదో నెగెటీవ్ కామెంట్ చేస్తేనో, ట్రోలింగ్ చేస్తేనో తప్ప ఆ వీడియో కి భారీగా రెస్పాన్స్ రాదని, కావలని కొందరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ని టార్గెట్ చేస్తారు. అలానే ఇంకొన్ని వీడియోల్లో పవర్ స్టార్ ప్రస్థావన కున్నా, థంబ్ నేయిల్స్ లో కావాలని పవన్ పేరుని రాస్తారు.. ఈరెండు సందర్భాల్లో ఈహీరోల ప్రస్థావనుంటే తప్ప వాళ్ల వీడియోలకి కాలం కలిసిరాదనేది తాత్పర్యం…

అచ్చంగా అలానే రెబల్ స్టార్ సీన్ లోకి రాకపోతే, బాలీవుడ్ సినిమాకు ఏది వర్కవుట్ కాదా? పని కట్టుకుని రెబల్ స్టార్ ని సీన్ లోకి తీసుకొస్తున్నారు. అక్కడ ఒకప్పడు సినిమా హిట్ అవ్వాలంటే, ఖాన్లు, కపూర్లని ప్రమోషన్స్ కి పిలిచేవాల్లు.. ఇప్పుడు సీన్ మారింది. ఖాన్లు, కపూర్లే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రమోషన్లకు కాదు, ఏకంగా తమ సినిమాలోకే ఆహ్వానిస్తున్నారు.

ప్రజెంట్ రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో రామాయణం తెరకెక్కుతోంది. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దంగల్ ఫేం నితీష్ తీవారి తీస్తున్న ఈ సినిమాకు అర్జెంట్ గా రెబల్ స్టార్ సాయం అవసరమైంది. ఆమద్య రణ్ బీర్ కపూర్, తన బ్రహ్మస్త్ర ప్రమోషన్ కి రాజమౌళితో పాటు, ప్రభాస్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆమిర్ ఖాన్ కూడా చిరు నుంచి చరణ్, నాగ్ వరకు మధ్యలో ప్రభాస్ వరకు అందరి సాయం తీసుకునే సౌత్ లోనే కాదు, నార్త్ లోకూడా బానే పబ్లిసిటీ తో హైప్ తెచ్చుకున్నాడు

కట్చేస్తే ఇప్పుడు రణ్ బీర్ కపూర్ రామాయణాన్ని ప్రమోట్ చేయటం కాదు, ఆ సినిమా భారం కాస్త మోసేందుకు రెబల్ స్టార్ సాయం తీసుకుంటున్నారు. ఇందులో పరశురాముడి పాత్ర కోసం రెబల్ స్టార్ ని సంప్రదిస్తే, తను ఫౌజీ, రాజా ది గ్రేట్ తోపాటు స్పిరిట్, సలార్ 2 ప్లానింగ్ లోఉన్నాడని తేల్చాడట

ఏదో ఒకటి రెండు రోజుల గెస్ట్ రోల్ కోసం షూటింగ్ కివస్తానంటే, అది మూడు భాగాల సినిమా, ఒక్కో భాగాంలో పరశురాముడి పాత్రుకోసం కనీసం 20 రోజుల కాల్ షీట్స్ కావాలంటే కుదిరేలా లేదు. కాని రెబల్ స్టార్ అందరి డార్లింగ్ అందుకు, కరణ్ జోహార్, సీన్ లోకి రావటం, రిక్వెస్ట్ చేయటంతో, కాల్ షీట్స్ ఇచ్చేందుకు సిద్దపడ్డాడు. కాని తన ఫ్లెక్సిబిలిటీ చూసుకునే డేట్లిస్తానన్నాడట. మొత్తానికి పాన్ ఇండియా హిందీ రామాయనానికి కూడా రెబల్ స్టార సాయం అవసరమైంది. ఆల్రెడీ ఆదిపురుష్ లో రాముడిగా దాడి చేసిన ప్రభాస్, ఇప్పుడు పరశురాముడి అవతారం ఎత్తే టైం వచ్చినట్టుంది.