రెబల్ స్టార్ ని మొన్న ఒకడు జోకర్ అన్నాడు. తర్వాత తప్పైందిఅంటూ తన ఉద్ధేశ్యం వేరని ఏదో ప్రభాస్ ని, తన ఫ్యాన్స్ ని మునగ చెట్టెక్కించేలా పొగిడాడు… ఎవరేమన్నా కాదన్నా రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్… ఐదు పాన్ ఇండియా హిట్లు కొట్టి బాలీవుడ్ మార్కెట్ కి మొగుడై కూర్చున్నాడు. ఇదే ఖాన్లు, కపూర్లు తట్టుకోలేకపోతున్నారు. బాహుబలి టైం నుంచే ప్రభాస్ పేరుని ఉచ్చరించలేనంతగా అసూయతో చచ్చిపోతున్నారు. కాబట్టి హిందీ హీరోలే కాదు, అక్కడి మీడియాకు కూడా సౌత్ స్టార్లు ఈ రేంజ్ లో పాన్ ఇండియానే కాదు, పాన్ ఆసియాను కూడా కమాండ్ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కాని అదే జరుగుతోంది. అందుకే తట్టుకోలేక, అలాగని సైలెంట్ గా నోరు మూసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇదే ఫీలింగ్ బాలీవుడ్ మీడియాలో కొంతమందికి ఉన్నట్టుంది. అందుకే ఏ తెలుగు హీరో పాన్ ఇండియాని షేక్ చేస్తున్నా, పనికట్టుకుని ఏదో ఒక కామెంట్ తో బురద చల్లే పనిచేస్తున్నారు. ది రాజా సాబ్ మూవీలో రెబల్ స్టార్ లుక్ మీద ఆల్రెడీ బురద చల్లే కార్యక్రమాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు దేవర మీద కుళ్ళుతో నెగెటీవ్ ప్రమోషన్ చేశారు. ఇప్పడు ప్రభాస్ మూవీని తగులుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో ప్రభాస్ లుక్ మార్చారన్న వాళ్ల కామెంట్లకు కౌంటర్లు కూడా సాలిడ్ గా పెరిగాయి.. అవేంటోచూసేయండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతీ తీసిన, తీస్తున్న ది రాజా సాబ్ ఏప్రిల్ లోరిలీజ్ కాబోతోంది. ప్రజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ తో బిజీ అయిన ప్రభాస్, తర్వాత స్పిరిట్ తో సమ్మర్ నుంచి కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఇలా అంతా కూల్ గా సాగిపోతున్న టైంలో, రెబల్ స్టార్ బర్త్ డే కాబట్టి ఫ్యాన్స్ కోసం మారుతీ టీం ది రాజా సాబ్ పోస్టర్ ని రివీల్ చేసింది. ప్రభాస్ కూడా అదిరిపోయే లుక్ తో కిక్ ఇస్తున్నాడు…
ఇలా అంతా కూల్ గా ఉందనకున్న టైంలో, బాలీవుడ్ లో దిక్కుమాలిన ఓ బ్యాచ్ సోషల్ మీడియాలో విషం కక్కింది. ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో హీరోని మార్చారంటూ రచ్చ మొదలైంది.
కల్కీలో కాస్త బొద్దుగా ఉన్న ప్రబాస్ అంతలోనే, ఇంత స్లిమ్ అయ్యాడా అంటూ ఇది ఏ ఐ సాయంతో ప్రభాస్ ని సన్నగా మార్చే ప్రయత్నమే అన్నారు.
ఇది నిజంగా కుళ్లుతో ప్రభాస్ మీద బురద చల్లటమే… రెబల్ స్టార్ అంటేనే నో కాంట్రవర్సీ.. ఎవరిజోలీకిపోడు, వివాదాల్లో ఇరుక్కోడు… ఎఫైర్ల వార్తల్లో ఉండడు… అందుకే అందరి డార్లింగ్ అయ్యాడు. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఇష్టపడే కటౌట్ గా ఎదిగాడు… అలాంటి తన మీద పని కట్టుకుని బురద చల్లటం అంటే, అంత సాహసం సౌత్ లో ఎవరూ చేయరు.. అలా చేస్తున్నారంటే బాలీవుడ్ లో మనోళ్ల ఎదుగుదల ఓర్వని ఓ బ్యాచ్ ఉంది..అదే తెలుగు హీరోల్లో ఎవరి సినిమా పాన్ ఇండియా లెవల్లో వచ్చినా, ముందు వాళ్ల చేతులకు బురద పూసుకుని, తర్వాత మన మూవీల మీద చల్లే ప్రయత్నం చేస్తారు.
దేవర టైంలో అయితే లెక్కలేనంతగా నెగెటీవ్ ప్రచారం జరిగింది. అయినా నార్త్ ఇండియాలోనే దేవర వసూళ్లు ఒకటికి పదిరెట్లు ఘనంగానే వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఎన్టీఆరే కాదు, చరణ్, బన్నీ కూడా ఇలాంటి ట్రోలింగ్స్ ని నార్త్ లో ఫేస్ చేశారు. ఐనా వాళ్ల సక్సస్ రేటుని కాదు కదా, కనీసం వాళ్ల బూటుని కూడా ఈ కామెంట్లు టచ్ చేయలేకపోయాయి
ఒక వైపు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ప్రొడక్షణ్ హౌైజ్ లో సగం వాటా అమ్మేశాడు. కంగనా ఆఫీసు అమ్మేసింది. ఇలా బాలీవుడ్ దివాలా అంచున ఉండటంతో బడా కటౌట్లు అన్నీ దుకానం సర్దేస్తున్నాయి.అయినా బుద్దిరాని కొంతమంది బ్యాచ్ సౌత్ సినిమాల మీద విషం కక్కడం ఆపట్లేదు. ది రాజా సాబ్ లో ప్రభాస్ లుక్ సన్నగా ఉండటానికి కారనం ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ కాదు, తను నిజంగానే సన్నబడటం. కల్కీ టైంలో కాస్త గ్యాప్ వచ్చినప్పుడు సన్న బడ్డ ప్రభాస్, ఆ టైంలో తీసిన సీన్స్ సంబంధించి తన లుక్ ని రివీల్ చేశారిప్పుడు. ఇందులో మూడు గెటప్స్ లో కనిపించే ప్రభాస్ పాత్రకు అనుగునంగా మారాల్సి వస్తుందట. ఆ రియాలిటీ తెలియక, హిందీ హీరోల్లా సిక్స్ ప్యాక్స్ కోసం గ్రాఫిక్స్ మీద ఆధార పడతారనుకుంటున్నట్టున్నారు అక్కడి బ్యాచ్. ఇది అసలు సిసలైన ప్రభాస్ లుక్కే… ఆవిషయంలో ఫిల్మ్ టీం క్లారిటీ కూడ ఇచ్చేసింది.