Prabhas Vs Shah Rukh Khan: బాక్సాఫీస్ యుద్ధం.. సౌత్, నార్త్ మధ్యయుద్ధం ఫిక్స్

ఇప్పటిదాకా సౌత్ నుంచి వచ్చిన సినిమాలు నార్త్‌లో.. నార్త్ నుంచి వచ్చిన సినిమాలు సౌత్‌లో ఏ ప్రాబ్లం లేకుండా ఆడుతున్నాయి. అయితే మొదటిసారి ఓ రెండు సినిమాలు మాత్రం ఉత్తర, దక్షిణాది మధ్య ఎన్నడూ లేని కొత్త పోటీకి దారితీస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 03:23 PM IST

Prabhas Vs Shah Rukh Khan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. వార్ ఎప్పుడూ హీరోల మధ్య జరిగేది. కానీ ఇప్పుడు సౌత్, నార్త్ మధ్య యుద్ధం ఫిక్స్ అయింది. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ.. పోటీ మాత్రం టెన్షన్ పెట్టిస్తోంది. ఇంతకీ పోటీ పడుతున్న ఆ స్టార్స్ ఎవరో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచి మారింది. ఏ భాష నుంచి సినిమా వచ్చినా ఆదరిస్తున్నారు. స్టోరీ బాగుంటే చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు.

Bigg boss: మర్డర్ కేసు.. బిగ్ బాస్ హౌస్‌లో హత్య.. విచారిస్తున్న అర్జున్, అమర్

ఇప్పటిదాకా సౌత్ నుంచి వచ్చిన సినిమాలు నార్త్‌లో.. నార్త్ నుంచి వచ్చిన సినిమాలు సౌత్‌లో ఏ ప్రాబ్లం లేకుండా ఆడుతున్నాయి. అయితే మొదటిసారి ఓ రెండు సినిమాలు మాత్రం ఉత్తర, దక్షిణాది మధ్య ఎన్నడూ లేని కొత్త పోటీకి దారితీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓ రెండు సినిమాల కోసం ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవే డంకీ, సలార్. ఈ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా ఒకే సమయంలో విడుదలకు సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. సౌత్, నార్త్ మధ్య పోటీలో ఎవరు గెలుస్తారో అనేదానిపై డిబేట్ నడుస్తోంది. ఇప్పటికే సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవగా.. అంతకంటే ముందే డంకీ నుంచి డ్రాప్ 2 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అటు డంకీ, ఇటు సలార్ మేకర్స్.. ఎవరికి వారు తమ కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు. అయితే ఒక్కరోజు ముందుగా డంకీ రావటం ఓపెనింగ్ పరంగా షారుక్‌కు కలిసివచ్చేలా ఉంది.

నార్త్‌లో షారుక్ హవా ఎక్కువగా ఉంటే.. సలార్ మాత్రం సౌత్ వసూళ్ల పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తెలుగు, కన్నడ వరకు సలార్‌కు ఎలాంటి ఢోకా లేదు. కానీ మిగతా బాషల్లోనే అసలు ఇబ్బంది‌ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు షారుక్ జవాన్, పఠాన్‌లకు సౌత్‌లో అది కూడా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు రాగా.. సలార్ వల్ల ఈసారి డంకీపై ఎఫెక్ట్ పడనుంది‌‌. మొత్తానికి ఏరియాల వైజ్ తమ‌కున్న బలాలను నమ్ముకునే షారుక్, ప్రభాస్ బాక్సాఫీసు పోటీకి సిద్దమవుతున్నట్లుగా కన్పిస్తోంది.