Boyapati Srinu: బోయపాటి శ్రీనుకు మళ్లీ దర్శకుడిగా నిరూపించుకునే ఛాన్స్ వచ్చినా యూజ్ చేసుకోలేకపోయాడు. డైరెక్టర్‌గా కెరీర్‌లో సరైనోడు, తులసి, లెజెండ్, అఖండ వంటి సూపర్‌హిట్స్ ఉన్నా.. ఇంకా నిరూపించుకునేది ఏంటన్న డౌట్ మీకు రావచ్చు. అయితే.. ఓ విషయంలో మాత్రం బోయపాటి శ్రీను వెనుకపడిపోయాడు. బోయపాటి ఇప్పటివరకు 9 సినిమాలు తీస్తే.. డెబ్యూ మూవీ భద్ర, జయ జానకినాయక, స్కంద మినహాయిస్తే.. ఆయన హీరోలందరూ స్టార్సే. మధ్యలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జయ జానకి నాయక తీస్తే నిరాశపరిచింది.
సినిమా ఫర్వాలేదనిపించుకున్నా.. ఇమేజ్ లేని హీరోపై భారీ బడ్జెట్ పెట్టడంతో బ్రేక్ ఈవెన్ కాలేదు. బోయపాటి శ్రీను స్టార్స్‌కు హిట్స్ ఇచ్చినా.. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు. మళ్లీ చాలాకాలం తర్వాత రామ్‌ను డైరెక్ట్ చేశాడు. ఈ మరకను స్కందతో తుడిచేయాలనుకున్నా.. కుదర్లేదు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా రూ.15 కోట్ల దూరంలో ఉండిపోయింది. స్టార్స్‌తో హిట్ కొట్టిన బోయపాటి.. యంగ్ హీరోలకు సక్సెస్ ఇవ్వలేకపోతున్నాడు ఎందుకు..? యంగ్ హీరోలను కూడా పెద్ద హీరోలనుకుని డీల్ చేసి రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..? కుర్ర హీరోలు దెబ్బకు పదిమందిని మట్టి కరిపించడంలాంటి యాక్షన్ సీన్స్ ఓవర్ అనిపించి ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారా..? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి.
పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా.. అందరినీ బోయపాటి ఒకేలా చూసి.. ఆడియన్స్‌కు చూపించడం మైనస్ అవుతోందంటున్నారు విశ్లేషకులు. యంగ్ హీరోకు తగ్గ కథ రాసుకోలేకపోవడంతో జయ జానకి నాయక, స్కంద బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయ్. స్కంద తర్వాత బోయపాటి నెక్ట్స్ మూవీపై క్లారిటీ లేదు. అల్లు అర్జున్ మెయిన్ ప్రిఫరెన్స్ అంటున్నాడు బోయపాటి. పాన్ ఇండియా స్టార్ బన్నీ డేట్స్ ఇవ్వకపోతే.. మరో హీరోతో సినిమా వుంటుందన్నాడు. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య.. బాబీ డైరెక్షన్‌లో నటిస్తాడు. దీంతో అఖండ 2 సెట్స్‌పైకి రావడానికి టైం వుండడంతో మరో సినిమా చేయడం పక్కా. అది యంగ్ హీరోనా.. స్టారా.. అన్న దానిపై క్లారిటీ లేదు.