Skanda: బోయపాటి సినిమాలంటే భారీ పంచ్ డైలాగులు, హెవీ డోస్ ఉన్నయాక్షన్ సీన్లు, కత్తులు, రక్తాలు, అరుపులు, కేకలు ఉంటాయి. ఇవే మాస్ బాగా నచ్చే అంశాలు. అంతవరకు బానే ఉంది. కాని వీటి వల్ల బోయపాటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయ్యారనే కామెంట్ ఉంది. అలాగని బోయపాటి శీను సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చవా అంటే, వాళ్లకు కావాల్సినంత ఎమోషనల్ కంటెంట్ బోయపాటి మూవీలో ఉంటుంది. అయినా వాళ్లకు రీచ్ కాదు.
అదే ఇప్పుడు రామ్ మూవీ స్కంద కొంపముంచేలా ఉంది. భద్ర, తులసి, నుంచి సరైనోడు వరకు వరుసగా 6 హిట్లు సొంతం చేసుకున్న బోయపాటి మొదటి నుంచి తన సినిమా టీజర్లు, ట్రైలర్లు పూర్తిగా మాస్ కోసమే అన్నట్టు యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగ్స్‌తో నింపేస్తాడు. అందుకే తన సినిమాలు ఊరమాస్ కోసమే అన్న అభిప్రాయం క్రియేట్ అయ్యింది. కాని టీవీల్లో బోయపాటి సినిమాలు సీరియల్ టైంలో రిలీజైనా రేటింగ్స్ పెంచేస్తాయనే కాంప్లిమెంట్ ఉంది. అంటే అంతగా ఫ్యామిలీస్‌కి తన మూవీలు నచ్చితే, థియేటర్స్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రారనే డౌట్ వస్తుంది. దానికి కారణం ఎక్కడ కూడా బోయపాటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వవనేలా ప్రమోషన్ పెంచటమే. అఖండ మాస్‌కి ఎంత నచ్చిందో, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంత నచ్చింది. కారణం ఇందులో ఉన్న డివోషనల్ కోణం.
సరే స్కందకి అలాంటి తప్పు చేయొద్దని, కరీంనగర్‌లో జరిగిన ఈవెంట్‌లో ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని ప్రమోట్ చేశారు. ఇది మంచి స్టేట్ మెంటే. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే మాటే. కాని ఎప్పుడు చెప్పారు..? స్కంద రిలీజ్‌కు రెండు రోజులు ముందు చెప్పారు. దీనీవల్ల ఏం లాభం..? సో.. అంతంత మాత్రం ప్రమోషన్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లోకి స్కంద దూసుకెళ్లటం కష్టమనకోవాల్సి వస్తోంది.