నేషనల్ క్రష్ (National Crush) రష్మిక మందన్నా (Rashmika Mandanna) కెరీర్ స్కై హైగా దూసుకుపోతోంది. పుష్ప ది రైజ్ (Pushpa The Rise), యానిమల్ (Animal) సినిమాల తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోలకు వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాలు దోచుకుంటోంది. దీంతో.. ఆ అమ్మడికి వరుసగా ఆఫర్లు మీద ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అటు.. బ్రాండ్ ఎండార్స్మెంట్స్ విషయంలోనూ రష్మిక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఐకానిక్ ఫ్యాషన్ బ్రాండ్లకూ రష్మిక అంబాసిడర్‌గా వ్యహరిస్తోందంటే.. ఈ చిన్నదాని రేంజ్ ఎంత పీక్స్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ క్రమంలోనే రష్మిక క్రేజ్ జపాన్ను ఓ ఊపు ఊపేస్తోంది. రశ్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ జపనీస్ బ్రాండ్ టాప్-10లో చోటు దక్కించుకుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గత ఏడాది జపాన్ (Japan) కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్‌కి.. రష్మికని బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. రీసెంట్గా రష్మిక ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రష్మిక మందన్న ర్యాంప్ పై నడిచింది. ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రష్మిక ప్రమోట్ చేసింది. ఇప్పుడు రష్మిక ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్ జపాన్ టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ లిస్టును తయారు చేసి రిలీజ్ చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసిన ప్పుడు రశ్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది.
ఇంతవరకూ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఏ హీరోయిన్‌కూ దగ్గలేదు.. తొలిసారి ఆ అవకాశం భారతీయ నటిగా రష్మికనే దక్కించుకుని గ్రేట్ అనిపించుకుంది. అంతేకాదు.. ఈ ఫ్యాషన్ వీక్ కోసం జపాన్‌లో ల్యాండ్ అయినప్పుడు. ఈ నేషనల్ క్రష్‌కు ఊహించని రీతిలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అభిమానులు ప్లకార్డులు పట్టుకుని స్వాగతించారు. దీన్ని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని రష్మిక చాలా ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.. ప్రజెంట్ రష్మిక క్రేజ్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో చెప్పడానికి.. ఇక.. ఇప్పుడు తాను ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ఇచ్చిన జోష్‌తో.. భవిష్యత్ లో ఆమె మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్ ల్ని ప్రమోట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.