టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. రేప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన జానీ మాస్టర్… శనివారం తన ఇంటికి చేరుకున్నారు. ఇక జానీ మాస్టర్ విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు పండుగ చేసుకుంటున్నారు. దాదాపు 40 రోజుల పాటు ఆయన జైల్లోనే గడిపారు. కేసు విషయంలో ఏ పురోగతి లేకపోవడం కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ కు మద్దతు రావడం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
అసలు జానీ మాస్టర్ తప్పు చేయలేదని, ఆమె విషయంలో కూడా తప్పు ఉందని… ఎప్పటి నుంచో తనపై అత్యాచారం చేస్తుంటే మరి ఇన్నేళ్ళ పాటు ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు అయిన తర్వాత… ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసారు అధినేత పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కూడా అవార్డుల కమిటీ రద్దు చేసింది.
అప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చినా జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు రాలేదు. శుక్రవారం ఆయనకు బెయిల్ రాగా, శనివారం జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కూడా. అయితే ఇప్పుడు జానీ మాస్టర్… ఏపే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని… సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో ఆయన పవన్ ను కలిసేందుకు విజయవాడ వెళ్ళే అవకాశం ఉంది.
అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది, వాస్తవాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం కొన్ని సాక్ష్యాలతో ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు. కాని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, తాను ఆమెతో ఎప్పటి నుంచి కలిసి పని చేసాను, అసలు కేసు పెట్టడానికి ముందు ఏం జరిగింది వంటి విషయాలను జానీ మాస్టర్ అటు పవన్ కళ్యాణ్ కు, మీడియా కు వివరించే అవకాశం ఉంది. మళ్ళీ కెరీర్ పై ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉందని సమాచారం.