BRO REVIEW: టాలీవుడ్‌లో మరో జాతర మొదలైంది. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పండగసమయం రానే వచ్చింది. ది మోస్ట్ అవెయిటెడ్ మూవీ బ్రో.. మొత్తానికి రిలీజైపోయింది. తమిళ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన బ్రో.. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా మార్పులతో మేజిక్ చేసేందుకు సిద్ధమైపోయింది.
ముందుగా కథలోకి వెళ్తే.. తండ్రి హఠాన్మరణంతో కథనాయకుడు సాయి ధరమ్ తేజ్ వారి కంపెనీకి బాధ్యతలను భుజానికెత్తుకుంటాడు. 24 గంటలూ కంపెనీ గురించే ఆలోచిస్తూ.. కంపెనీ కోసమే పనిచేస్తూ కుటుంబంతో కూడా సరిగా గడపడు. తన లవర్‌కు మాట్లాడేందుకు కూడా టైం ఇవ్వడు.
చివరికి ఇద్దరికి బ్రేకప్ అయ్యే వరకు సిట్యూవేషన్ వెళ్తుంది.. సరిగ్గా అలాంటి సమయంలో ఓ పెద్ద యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ చనిపోతాడు. తాను చనిపోయినట్టు తెలిసి విలవిలలాడిపోతాడు.. తన కుటుంబం, తనని నమ్ముకున్నవాళ్లు ఏమైపోతారో అని ఆందోళన చెందుతుంటాడు. అప్పుడు దేవుడైన పవన్ కళ్యాణ్ ను తన బాధ్యతు తీర్చే సమయం ఇవ్వమని కోరతాడు.. అందుకు పవన్ అంగీకరించడంతో తిరిగి ఇంటికి వెళ్తాడు. అయితే తాను ఇంటికి వెళ్లాక.. అంతా మారిపోతుంది. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అవి ఏంటి అనేదే అసలు కథ.. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ యాజ్ యూజవల్‌గా అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో చాలాసేపు ఆయన కనిపించకపోవడంతో కాస్త స్లో అనిపించినా.. పవర్ స్టార్ ఎంట్రీ తర్వాత మూవీ స్పీడ్ అందుకుంది. ఇక సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. వివిధ గెటప్‌లలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ.. తన అభిమానులకి నోస్టాల్జిక్ ఫీల్‌ను కలిగిస్తాడు.
సాయి ధరమ్ తేజ్ పర్ఫార్మెన్స్‌కు వంకలు పెట్టలేం. ఇక హీరోయిన్ కేతిక శర్మ.. తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు సముద్రఖని టేకింగ్ బాగుంది. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన అందించిన సంగీతం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా బ్రో సినిమాని సముద్రఖని.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దడంలో సఫలం అయ్యాడు. మెగాఅభిమానులకు విజువల్ ట్రీట్ గా అనిపిస్తోంది బ్రో.