మెగా ఫ్యాన్స్ కు బుచ్చి ఫుల్ కిక్, ఆ దేవత దీవెనలతో

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కిక్ ను ఆచార్య బ్రేక్ చేసినా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతా అని ధీమాగా ఉన్నాడు ఈ మెగా హీరో.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 08:50 PM IST

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కిక్ ను ఆచార్య బ్రేక్ చేసినా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతా అని ధీమాగా ఉన్నాడు ఈ మెగా హీరో. రామ్ చరణ్ కెరీర్ లో గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా. అందుకే లేట్ అయినా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ధీమాతో అడుగులు వేస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా నార్త్ లో ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు మేకర్స్. రీసెంట్ గా లక్నోలో ఓ ఈవెంట్ చేయగా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇప్పుడు రామ్ చరణ్… హీరోగా ఉప్పెనతో బిగ్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ సాన బుచ్చిబాబు ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ‘ఆర్‌సీ16’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్తున్న ఈ సినిమాకు సుకుమార్ కూడా హెల్ప్ చేస్తున్నట్టు టాక్. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో… శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో సౌత్ స్టార్లను తీసుకోవాలని బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నాడు. కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాన్నాళ్ళు అయినా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. రామ్ చరణ్… గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. గత నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూసినా… శుక్రవారం నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసారు. కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో మొదటి షెడ్యూల్‌ ను ప్లాన్ చేసారు మేకర్స్.

గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ షూట్ ఫినిష్ కావడంతో… మైసూరు వెళ్ళాడు చెర్రి. అక్కడే జాన్వీ కపూర్, రామ్ చరణ్ పై అక్కడి ఫేమస్ దేవాలయం చాముండేశ్వరి ఆలయంలో షూట్ చేయనున్నారు. శివకుమార్… హీరోయిన్ కు తండ్రిగా నటించే అవకాశం కనపడుతోంది. మైసూర్‌లోని చాముండేశ్వరి మాత ఆలయంలోనే కొన్ని కీలక సీన్స్ ను మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు… దేవాలయాన్ని సందర్శించి… ఓ ఫోటో కూడా షేర్ చేసాడు. “ది మోస్ట్ అవెయిటెడ్ మూమెంట్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు బుచ్చి.

చాముండేశ్వరి మాత బ్లెసింగ్స్‌ తో ఈ సినిమాని మొదలు పెడుతున్నామని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు బుచ్చిబాబు. ఇక మైసూరులోనే సినిమాను కంటిన్యూ గా 15 రోజుల పాటు షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ జాలరిగా కనిపించే అవకాశం ఉందని టాక్. మట్టి లాంటి కథ ఇదని ఇప్పటికే… రామ్ చరణ్ కూడా చెప్పుకొచ్చాడు. దీనితో మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.