Allu arjun : పుష్ప-2 కోసం బన్నీ భారీ టార్గెట్..?

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun)- లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa2) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ కాంబోలో వచ్చిన పుష్ప-1 ఓ రేంజ్‌లో రచ్చ రేపింది. ‘పుష్ప’ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ కూడా పట్టేసి అరుదైన రికార్డు కొట్టేసాడు. దీంతో.. పుష్ప-2 పై వరల్డ్ వైడగ్‌గా ప్రేక్షకుల్లో హైలైవల్ హోప్స్ ఉన్నాయి.

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun)- లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa2) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ కాంబోలో వచ్చిన పుష్ప-1 ఓ రేంజ్‌లో రచ్చ రేపింది. ‘పుష్ప’ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ కూడా పట్టేసి అరుదైన రికార్డు కొట్టేసాడు. దీంతో.. పుష్ప-2 పై వరల్డ్ వైడగ్‌గా ప్రేక్షకుల్లో హైలైవల్ హోప్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సీక్వెల్ నుంచి వచ్చిన అప్డేట్స్‌కు ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో.. పుష్ఫ-2 రిలీజ్ కోసం వరల్డ్ వైడ్‌గా బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పుష్ఫ-2 నుంచి వినిపిస్తున్న ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘పుష్ప -2’ను పుష్ప-1 ను మించి తెరకెక్కించేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.. ఇక ఐకాన్‌ స్టార్ కూడా దీని గురించి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడట.. ‘పుష్ప2’తో బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారట.. ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనేదే బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాడట. దీనికోసం పుష్ప-2 మూవీని డబుల్ ఎనర్జిటిక్‌గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐకాన్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పార్ట్ 2 లో తన రోల్ పుష్ప.. అలాగే ఫహద్ ఫాజిల్ పోషిస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ నడుమ మెయిన్ పాయింట్ మరింత ఆసక్తిగా బిగ్గర్ స్కేల్ లోకి తీసుకెళ్తుందంటూ బన్నీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పుష్ప-2లో ఈ ఇద్దరి మధ్య ఈగో వార్ మూవీని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) క్లైమాక్స్‌లో ఇద్దరి మధ్య పెద్ద వార్ కు.. సుకుమార్ తెర లేపాడు. పుష్ప-2 లో ఇది ఏ లెవెల్‌ కు చేరుతుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. పార్ట్ 2 లో ఇద్దరి మధ్య ఈగో క్లాష్ పతాక స్థాయిలో ఉంటుంది అని బన్నీ కూడా కన్‌ఫామ్ చేసేశాడు. దీంతో.. ఈగో వార్ పతాక స్థాయిలో ఉంటుందని.. ఇది సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఇదే విషయంపై ఫిక్సయిపోయారు. మరి.. ఈ ఇగో వార్‌ను లెక్కల మాస్టారు ఎలా బ్యాలెన్స్ చేస్తారో తెలియాలంటే.. పుష్ప-2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే..