ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఏమో గాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు షేక్ షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో అవసరం ఉన్న వాళ్ళు, ఉంటుందనుకున్న వాళ్ళు, స్నేహితులు, ఆప్తులు, బంధువులు ఇలా ప్రతీ ఒక్కరు బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఒక రోజు జైల్లో పెట్టడాన్ని ఇప్పుడు అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోవడం లేదు. పుష్ప 2 తో నేషనల్ స్టార్ అయిపోయిన బన్నీకి పోలీసులు ఇచ్చిన షాక్ తో నేషనల్ మీడియా మైండ్ కూడా బాల్క్ అయింది. జరగదు అనుకున్నది జరిగే సరికి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి.
అయితే ఈ అరెస్ట్ ప్రభావం పుష్ప 2 సినిమా వసూళ్ళపై ఏమైనా పడిందా అనే చర్చ మొదలయింది. జాతీయ స్థాయిలో ఈ విషయం ఫేమస్ అవుతోంది. బన్నీపై సింపతి పెరిగి వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వెస్థున్న్నాఉ. ఇక బన్నీని అరెస్ట్ చేసిన శుక్రవారం అంటే సినిమా రిలీజ్ అయిన 9వ రోజున రూ.36.25 కోట్లు వసూలు చేసింది పుష్ప-2. హిందీలో మతిపోయే రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.762, ప్రపంచవ్యాప్తంగా రూ.1067 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.
వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ వస్తోంది. అక్కడి ఫ్యాన్స్ కు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ కథనం ప్రకారం లెక్కలు ఒకసారి చూస్తే… ఈ మూవీ శుక్రవారం హిందీ వెర్షన్‌లో రూ.27 కోట్లు వసూలు చేస్తే మన తెలుగు వెర్షన్‌లో కేవలం రూ.7.5 కోట్లు వసూలు చేసింది. తమిళంలో రూ.1.35 కోట్లు, కన్నడ, మలయాళంలో రూ.0.2 కోట్లు వచ్చాయి.
హిందీ లెక్కలు చూస్తే అర్ధం చేసుకోవచ్చు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రేంజ్ ఎలా ఉందో. ఈ వసూళ్లతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.762.1 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 2 డామినేషన్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారు. శని ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండవచ్చు అనే దానిపైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. మలయాళంలో సినిమా అంత గొప్పగా ఆడలేదు. ఫాహాద్ ఫాజిల్ రోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే కచ్చితంగా అక్కడ కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉండేది.