బన్నీ “పొలిటికల్” స్క్రీన్ ప్లే వర్కౌట్…?

గతంలో సింపతీ స్టోరీలు రాజకీయాల్లో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సినిమాలకు కూడా పాకి వసూళ్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు ఈ సింపతీ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 11:29 AM IST

గతంలో సింపతీ స్టోరీలు రాజకీయాల్లో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సినిమాలకు కూడా పాకి వసూళ్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు ఈ సింపతీ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఆ బాటలో అల్లు అర్జున్ కూడా వెళ్ళినట్టే కనపడుతోంది. డిసెంబర్ లో విడుదలయ్యే సినిమా కోసం బన్నీ ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేసుకున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అనే టాక్ వినపడుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా వాతావరణం మారింది.

దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ ఆజ్యం పోశారు. ఆ తర్వాత పలువురు జనసేన నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఇక్కడ బన్నీ స్కెచ్ వేరే లెవెల్ లో ఉందనే టాక్ వినపడుతోంది. ఆయన అనుకున్న ప్లాన్ సరిగానే వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినపడుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కాబట్టి క్రమంగా బన్నీకి వైసీపీ కార్యకర్తల నుంచి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ సోషల్ మీడియాలో బన్నీపై చర్చ మొదలయింది.

తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధికి బన్నీ సపోర్ట్ చేసాడు కాబట్టే కదా వాళ్ళు టార్గెట్ చేస్తుంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు చర్చిస్తున్నారు. అలాగే పుష్ప సినిమాను వాళ్ళు ఇబ్బంది పెట్టినా మనం కాపాడాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉండవచ్చు. ఇదంతా బన్నీ ముందే ఊహించి… వివాదాన్ని కాస్త పెద్దది చేసి ఉండవచ్చు. సినిమా బాగుంటే వైసీపీలో కూడా తనకు ఫ్యాన్స్ పెరుగుతారు. ఇది తన తర్వాతి సినిమాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ వివాదాన్ని ఆరిపోకుండా కాపాడుతున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలే చేస్తున్నారు. వీటిల్లో ఏది జరిగినా సరే బన్నీకె లాభం ఉంటుంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జనసేనపై సీరియస్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తనకు సపోర్ట్ చేయవచ్చనే యోచనలో అల్లు అర్జున్ ఉండవచ్చు.