మెగా ఫ్యామిలీ వర్సెస్ బన్నీ మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ పేరు చెప్పను బ్రదర్ అని బన్నీ అన్నప్పుడు స్టార్ట్ అయిన రచ్చ.. ఆ తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నాడు… చెర్రీ బర్త్‌డేకు కనీసం విష్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఏకంగా పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీ కోసం పనిచేశాడు. ఇదంతా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెంచింది.
ఐతే ఇంత జరిగినా.. నమ్మిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. ఎక్కడికైనా వెళ్తా అంటూ పరోక్షంగా బన్నీ స్టేజీ మీద చెప్పిన మాటలు.. మంటలను మరింత రాజేశాయ్. కట్ చేస్తే.. బన్నీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటి పరిణామాల మధ్య… పవన్ కల్యాణ్ బర్త్‌డే రోజు బన్నీ విష్ చేస్తాడా లేదా అని అంతా ఎదురుచూశారు. ఐతే ఫైనల్‌గా పవన్‌కు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడే కాదు… ఆగస్ట్ 22న చిరు బర్త్‌డేకు కూడా బన్నీ విషెస్ చెప్పాడు.
ఐతే బన్నీ ఇలా రియాక్ట్ కావడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి ఇక తెర పడినట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వైసీపీ అభ్యర్తి శిల్పా రవి కోసం బన్నీ ప్రచారం చేసిన తర్వాత.. మెగా, అల్లు కుటుంబాల మధ్య యుద్ధం జరిగినట్లు టాక్ నడిచింది. ఆ ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా.. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్‌కు చేరింది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి అభిమానులు యుద్దం చేసుకున్నారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేయడం, పవన్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం… ఇదే టైమ్‌లో జనసేన ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించడంతో.. రచ్చ మరింత రాజుకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అంటూ బన్నీ విషెస్ చెప్పడంతో.. యుద్ధానికి ముగింపు పలికినట్లే అని కొందరు అంటుంటే.. అదేం లేదు ఏదో పరాయి వాళ్లకు చెప్పినట్లు ఆ ట్వీట్ కనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ విషెస్‌తో అయినా రచ్చ ఆగుతుందో లేదో చూడాలి మరి.