సానుభూతి ఉన్నా… కల్కీని దాటమే కష్టం… ఇంకా బాహుబలినా..?

పుష్ప 2 మూవీ 1000 కోట్ల దాటాకే బన్నీకి కష్టాలు మొదలయ్యాయి. కేసు, అరెస్టు, తర్వాత విడుదల.. మొత్తం ఈ ఎపిసోడ్ తో సినిజనాలంతా బన్నీకి సపోర్ట్ గా నిలిచారు. ఈ విషయంలో సినీ పరివ్రమ యూనిటి, అలానే మెగా హీరోల సానుభూతి, సపోర్ట్ అన్నీ ఒక్కసారిగా బన్నీ మీదున్న వ్యతిరేకతని తగ్గించాయి.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 03:58 PM IST

పుష్ప 2 మూవీ 1000 కోట్ల దాటాకే బన్నీకి కష్టాలు మొదలయ్యాయి. కేసు, అరెస్టు, తర్వాత విడుదల.. మొత్తం ఈ ఎపిసోడ్ తో సినిజనాలంతా బన్నీకి సపోర్ట్ గా నిలిచారు. ఈ విషయంలో సినీ పరివ్రమ యూనిటి, అలానే మెగా హీరోల సానుభూతి, సపోర్ట్ అన్నీ ఒక్కసారిగా బన్నీ మీదున్న వ్యతిరేకతని తగ్గించాయి. మొత్తంగా సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటనలో చనిపోయిన వ్యక్తి మీద
అందరికీ బాధున్నా, బన్నీ ఈ విషయంలో ప్రత్యక్షంగా తప్పు చేయలేదనే అభిప్రాయం పెరిగిపోతోంది.. ఇలాంటి సానుభూతి ఉన్నటైంలో అన్నీ తనకి కలిసిరావాలి.. కాని పుష్ఫ 2 వసూల్లు 6 వరోజు నుంచి డ్రాప్ అవుతూ వస్తున్నాయి. నిన్న భారీగా వసూల్లు డ్రాపయ్యాయి. ఆలెక్కలు నిజంగా షాకిస్తున్నాయి… దీంతో పుష్ప2 మూవీ కల్కీని వసూల్లని రీచ్ అవటమే కష్టం, ఇంకా బాహుబలి 2 రికార్డులని బ్రేక్ చేయటమా అనంటున్నారు.. కంపేరిజన్ కి ఇది సరైన సమయం కాదు కాని, నిన్నటి వసూల్ల లిస్ట్ రావటంతో ఈ పోలిక తప్పట్లేదనే అభిప్రాయం పెరిగింది.

పుష్ప 2 మూవీ వెయ్యికోట్ల వసూల్ల సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకునేలోపే, బన్నీ అరెస్ట్ తో సీన్ మారిపోయింది. తను విడుదలయ్యాక ఇండస్ట్రీ అంతా తన ఇంట్లోనే కనిపించింది. మెగా వ్యతిరేకతకూడా కాస్త తగ్గి, మొత్తంగా తన మీద అందరి సానుభూతి కనిపించింది. సోషల్ మీడియాలో కూడా చాలావరకు వ్యతిరేక కామెంట్లు కూడా తగ్గిపోయాయి.

ఇంతగా తన మీద సాను భూతి పెరిగితే, అది పుష్ప2 కి ప్లస్ అవుతుందనుకుంటే, అక్కడ మాత్రం ఈ సానుభూతి పెద్దగా పని చేయట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో 8 వ రోజు పుష్ప2 కి 9 కోట్ల వసూల్లొస్తే, నిన్న ఏడున్నరకోట్లే వసూళయ్యాయి. తమిళ నాడులో మరీ కోటి ముప్పయైదు లక్షలు, కన్నడ , మలయాలం మార్కెట్ లో 20 లక్షలు, ఒక్క హిందీ మార్కెట్ లోమాత్రం 27 కోట్లొచ్చాయి… దీంతో ప్రజెంట్ ఈ సినిమా 1067 కోట్ల వసూళ్లతో సరిపెట్టింది

ఓవర్ సీస్ లో కూడా పదిన్నర మిలియన్ల దగ్గరే వసూల్లు ఆల్ మోస్ట్ స్లో అయ్యాయి. అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే 15 మిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి. కాని అది కష్టంగానే కనిపిస్తోంది. మొత్తంగా విడుదలైన 5 రోజుల వసూల్లు చూసి ఈ జీగా 1500 కోట్లు వస్తాయి. కాలం కలిసొస్తే బాహుబలి 2 తాలూకు 1850 కోట్ల వసూళ్ల రికార్డుని పుష్ప2 బ్రేక్ చేస్తుందన్నారు

కాని బాహుబలి 2 రికార్డ్ సంగతి అటుంచితే, రెబల్ స్టార్ మరో మూవీ కల్కీ తాలూకు 1200 కోట్ల రికార్డుని రీచ్ అవటమే ఇప్పుడు పుష్2 కి గగనమైంది. ఐదు రోజులు వసూల్ల వరదొచ్చి, ఆరోరోజు నంచి ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవటమే సౌత్ లో ఎవరికి అంతుచిక్కట్లేదు. హిందీ మార్కెట్ లో మాత్రం వసూళ్లు బానే ఉన్నాయి. మళ్లి యూఎస్ లో వసూళ్ల వరదకి సడన్ గా ఆనకట్ట పడింది. నిన్నటి ఎపిసోడ్ తో సాను భూతి వర్కవుట్ అవుతుందనుకుంటే, మరింతగా వసూల్లు డ్రాప్ అయ్యాయి. దీంతో 130 కోట్లు అదనంగా వస్తే తప్ప కల్కీ రికార్డుని రీచ్ అవటం కష్టం… ఇక త్రిబుల్ ఆర్ తాలూకు 1350 కోట్లను టచ్ చేయటం మాత్రం పుష్ప2 కి ఇప్పుడున్న ఫ్లోతో అయితే కష్టమే…