పుష్ప రాజ్ రెండోసారి బాక్సాఫీస్ బెండుతీశారన్నారు. టాకేమో రెండోరోజునుంచే వీకౌతున్న వేల 294 కోట్ల ఓపెనింగ్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. బయటేమో 167 కోట్ల గ్రాస్ వసూళ్లని లెక్కలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రా లో ఉన్న థియేటర్లు అవన్నీ హౌజ్ ఫుల్ అయితే వచ్చే వసూల్లు లెక్కేసినా ఎక్కడా 294 కోట్ల వసూళ్లతో లెక్క సరిపోవట్లేదు. ఇలాంటి టైంలో ఓవర్ సీస్ లో పుష్ప2 కి టిక్కెట్లు సరిగా తెగట్లేదని రెస్పాన్స్ వస్తుంటే, విచిత్రంగా అక్కడ మాత్రం 6 మిలియన్ల వసూళ్లంటున్నారు. నిజం కాకుండా ఇలా ప్రకంటించలేరు.. అలాని వస్తున్న టాకు, వాళ్లు ప్రకటించిన వసూల్ల నెంబర్లు ఎక్కడా సింకవ్వట్లేదు.. ఇంతకి ఏం జరిగింది? ఏంజరుగుతోంది? ఏది నిజం?
పుష్ప2 మొదటి రోజే 294 కోట్లొచ్చాయని నిర్మాత ఎనౌన్స్ చేశాడు. కట్ చేస్తే రెండోరోజు 400 కోట్లన్నారు. కాని రియాలిటీ చూస్తే మొదటి రోజు సాయంత్రానికే పుష్ప 2 కి నెగెటీవ్ టాక్ వచ్చింది. రెండో రోజుకే ఆన్ లైన్ బుక్కింగే కాదు, నార్మల్ బుక్కింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయ్ అంటున్నారు
కాని విచిత్రం ఏంటంటే నైజాంలో మొదటి రోజు 25 నుంచి 30 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 అన్నారు. కాని రెండో రోజేమో 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని తేల్చారు. అంటే రెండో రోజుకే 21 కోట్లకు కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయా? ఎంత ప్లాప్ టాక్ వచ్చినా మరీ వసూల్లు ఇంతగా తగ్గిపోవు…
ఇక తెలంగాణ, ఆంధ్రాలో పూనకాలొచ్చేలా త్రిబుల్ ఆర్ మూవీని చూశారు. టిక్కెట్ రేట్లు పెంచినా హౌజ్ ఫుల్ అయ్యాయి. అది కూడా కనీసం 30 రోజలుు.. అంత చేస్తే మొదటి రోజు 223 కోట్లే ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ కి వసూల్లొచ్చాయి. ఇక తెలంగాణ లో త్రిబుల్ ఆర్ వసూళ్లు మొదటి రోజు 21 కోట్లే వచ్చాయి. అలాంటిది పుష్ప2 కి 30 కోట్లు ఫస్ట్ డే వచ్చాయనే మాటే నమ్మశక్యంగా లేదంటున్నారు
ఇదే కాకుండా బాలీవుడ్ స్టైల్లో కార్పోరేట్ బుక్కింగ్స్ కూడా పెట్టి నెంబర్స్ ని ఏమైనా మ్యాని పులేట్ చేశారా? అంటే సౌత్ స్టార్స్ మరీ అంతకు దిగజారారనలేం. బాలీవుడ్ లో అలాంటి మ్యానిపులేషన్స్ ఉంటాయేమో కాని, పుష్ప 2 వసూళ్లు లెక్కల్లో కొంత వరకు నిజం ఉన్నట్టే, ఈ సినిమా వసూల్లు డ్రాప్ అయ్యాయనేది కూడా నిజమే.
పుష్ఫ హిట కాబట్టి, రెండో పార్ట్ కి ఆటోమేటిగ్గా అంచనాలు భారీగా ఉంటాయి. కాబట్టే అడ్వాన్స్ బుక్కింగ్స్ భారీగా జరిగాయి. సో మొదటి రోజు రెండు ఆటలై, ఫస్ట్ షో అయ్యేసరికి టాక్ మొత్తం రివర్స్ అయ్యింది. అంతమాత్రాన బుక్ చేసుకున్న టిక్కెట్లు రిటర్న్ చేయలేరు. కాబట్టే మొదటి రోజు భారీ ఎత్తున వసూళ్ళొచ్చాయి. రెండో రోజు కల్లా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అలా చూసినా 294 కోట్ల ఫస్ట్ డే వసూళ్లు, రెండో రోజు కలెక్షన్స్ 100 కోట్లంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టే ట్రోలింగ్ భారీగా పెంచారు. యాంటీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇలా అన్ని వైపుల నుంచి డౌట్లు కామెంట్ల రూపంలో పెరిగాయి.