వీళ్ల మ్యారీడ్ లైఫ్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా అది వైరల్‌గా మారిపోతుంది. అయితే భార్యతో విడిపోయినా కూడా ఇంకా సమంత జ్ఞాపకాల్లోఏ బతుకుతున్నాడు నాగచైతన్య. వాళ్లిద్దరూ విడిపోయి ఇంత కాలం అవుతున్నా.. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫొటోలు అలాగే ఉంచుకున్నాడు. సాధారాణంగా ఎవరైనా కపుల్ విడాకులు తీసుకుని విడిపోతే వాళ్ల జ్ఞాపకాలను చెరిపేస్తారు. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వీడియోలను డెలీట్ చేస్తారు. కానీ చైతన్య మాత్రం అలా చేయలేదు. ఇప్పటికే చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫొటోలు అలాగే ఉన్నాయి.
వాళ్లు సరదాగా దిగిన ఫొటోలు మాత్రమే కాదు. పెళ్లి ఫొటోలు కూడా ఇంకా అలాగే ఉంచుకున్నాడు చైతన్య. కానీ సమంత మాత్రం చాలా ఫొటోలు డెలీట్ చేసింది. వాళ్ల ఫ్రెండ్స్‌తో చైతన్య దిగిన ఫొటో తప్ప మిగతా అన్ని ఫొటోలు, పెళ్లి ఫొటోలు కూడా డెలీట్ చేసింది. దీంతో నాగ చైతన్య మాత్రం ఇంకా సమంత జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాడంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా సమంత గురించి చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు చై. సమంత చాలా మంచి వ్యక్తి అని.. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలంటూ చెప్పుకొచ్చాడు. తనతో గడిపిన జీవితానికి, సమయానికి చాలా వ్యాల్యూ ఇస్తానంటూ చెప్పాడు. నాగ చైతన్య చేసిన ఈ కామెంట్స్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.