CHANDRA MOHAN: ఎన్నో సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో.. ఎవరూ రీప్లేస్ చేయలేని స్థానాన్ని టాలీవుడ్‌కు వదిలి వెళ్లిపోయారు నటుడు చంద్రమోహన్. ఆయనేంటి, ఆయన యాక్టింగ్ ఏంటి అని అందరికీ తెలుసు తప్ప.. చంద్రమోహన్ కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. చంద్రమోహన్ భార్య గురించి సాహితీ ప్రేమికులకు అంతో ఇంతో తెలుసు. ఎందుకంటే ఆమె రైటర్ కాబట్టి. ఐతే చంద్రమోహన్ పిల్లల గురించి మాత్రం చాలామందికి తెలియదు. చంద్రమోహన్‌కు ఇద్దరు కూతుళ్లు.
CHANDRA MOHAN: మొదటి సినిమాకే అవార్డ్.. అదీ చంద్రమోహన్ అంటే..
ఆ ఇద్దరు కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటుంది. ఈ మాటలు ఒకప్పుడు చంద్రమోహన్ చెప్పారు. ఐతే చిన్నప్పుడు వాళ్లను చూసిన నటి భానుమతి.. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని గతంలో గుర్తు చేసుకున్నారు చంద్రమోహన్. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా పరిచయం చేద్దామని భానుమతి అడిగారు. ఐతే దాన్ని చంద్రమోహన్ సున్నితంగా తిరస్కరించారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అడుగుతారని భయం వేసేదని.. సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నానని.. అందుకే సినిమాలకు దూరంగా ఉంచానని చంద్రమోహన్ గతంలో చెప్పుకొచ్చారు. ఇక ఆ ఇద్దరు పిల్లలు చదువుల్లో బాగా రాణించారు. గోల్డ్ మెడలిస్ట్‌లుగా మిగిలారు. వాళ్లిద్దరు వారి వారి రంగాల్లో టాప్‌లో ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలతో వారికి మంచి పరిచయాలే ఉన్నాయ్ కానీ.. సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటున్నారు.
చంద్రమోహన్ మరణం తర్వాత ఆ ఇద్దరిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అంత ప్రేమగా ఇద్దరిని పెంచారు చంద్రమోహన్. ఆయన ఇంటికి చేరుకుంటున్న ఇండస్ట్రీ ప్రముఖులు.. చంద్రమోహన్ పిల్లలకు ధైర్యం చెప్తున్నారు. ఇక చంద్రమోహన్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత.. మొదటితరం హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చంద్రమోహన్ సినిమాలకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది.