CHANDRA MOHAN‎: మొదటి సినిమాకే అవార్డ్‌.. అదీ చంద్రమోహన్ అంటే..

ఆయన నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు అంటే.. చంద్రమోహన్‌ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదహారేళ్ల సినిమాకిగాను ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత సిరి సిరి మువ్వ సినిమాకి కూడా చంద్రమోహన్‌కు ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 02:11 PM IST

CHANDRA MOHAN: చంద్రమోహన్‌ మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయ్. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ టాలీవుడ్ విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. 1966లో ఆయన రంగులరాట్నం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర అయితేనే చేస్తాను అనే మనస్తత్వం చంద్రమోహన్‌ది కాదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Chandra Mohan: చంద్రమోహన్‌కు మాట ఇచ్చి తప్పిన ఎన్టీఆర్‌..!

సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, కమెడియన్ ఇలా అన్ని పాత్రలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు అంటే.. చంద్రమోహన్‌ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదహారేళ్ల సినిమాకిగాను ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత సిరి సిరి మువ్వ సినిమాకి కూడా చంద్రమోహన్‌కు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. 1987లో వచ్చిన చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం, 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఇక లోకల్ సంస్థల అవార్డులకైతే లెక్కేలేదు. తన పాత్రలతో మెప్పించి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు చంద్రమోహన్. సినీ పరిశ్రమకు దూరమయ్యాక కూడా కొన్ని సంస్థలు చంద్రమోహన్‌ని పిలిచి అవార్డులతో సత్కరించాయ్. అవార్డుల కంటే.. నటనకు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్‌నే చంద్రమోహన్ అవార్డులా ఫీలయ్యే వారు.

అందుకే ఆయన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతున్నాయ్. అందుకే ఫ్రస్ట్రేటెడ్‌ తండ్రి అంటే 7జీ బృందావన కాలనీ సినిమానే గుర్తుకు వస్తుంది. ఓ కొడుకు భవిష్యత్ కోసం ఆలోచించే తండ్రి అంటే నువ్ నాకు నచ్చావే గుర్తొస్తుంది. అన్నయ్య అంటే కృష్ణ సినిమా గుర్తుకువస్తుంది. ఇలా ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి.. అవార్డులకు మించి జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు చంద్రమోహన్‌.