Chandra Mohan: సంచలనం రేపుతున్న వీలునామా..! తలకొరివి పెట్టిన సోదరుడికి రూ.60కోట్లు

చంద్రమోహన్‌ది చాలా లక్కీ హ్యాండ్ అని అంటారు. శోభన్ బాబు నుంచి ఇటు శ్రీదేవి, జయప్రద, జయసుధ వరకు ఎంతోమంది ఆయనను లక్కీ పర్సన్ అంటుంటారు. తనకు తాను కూడా లక్కీనే. చంద్రమోహన్ ఇన్నేళ్ల కెరీర్‌లో దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 06:40 PM IST

Chandra Mohan: టాలీవుడ్‌లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్.. పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు. ఆయన వందల సినిమాల్లో నటించినా, చేతినిండా సంపాదించినా చివరి రోజుల్లో మాత్రం చాలా నిరాడంబరంగా గడిపారు. చంద్రమోహన్‌ది చాలా లక్కీ హ్యాండ్ అని అంటారు. శోభన్ బాబు నుంచి ఇటు శ్రీదేవి, జయప్రద, జయసుధ వరకు ఎంతోమంది ఆయనను లక్కీ పర్సన్ అంటుంటారు.

Rashmika Mandanna: బెడ్‌పై రష్మిక మందన్నా.. ఏంటా ట్వీట్.. అసలేమైంది..?

తనకు తాను కూడా లక్కీనే. చంద్రమోహన్ ఇన్నేళ్ల కెరీర్‌లో దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆస్తి పంపకం విషయమై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఆయన వీలునామా రాశారని, దాని ప్రకారమే పంపకాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. ఆయనకు తలకొరివి పెట్టిన వ్యక్తికి భారీ మొత్తంలో ఆస్తి ఇవ్వాలనుకున్నారట. వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం కూతుళ్లకు ఇవ్వాలని ఆయన రాశారట. అయితే తనకు తలకొరివి పెట్టిన వారికి ఆస్తిలో 20 శాతం ఇవ్వాలని ఉందట. అంటే దాదాపు రూ.60 కోట్లు ఆయనకి తలకొరివి పెట్టిన వారికి దక్కుతుందట. చంద్రమోహన్ అంత్యక్రియలను సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. దీంతో ఈ డబ్బు ఆయనకే చెందుతుందన్న ప్రచారం నడుస్తోంది. గుండె సంబంధిత వ్యాధితో చంద్రమోహన్ కన్నుమూశారు. ఇదిలా ఉంటే తన కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ఓవైపు సినిమాలు చేస్తూనే వచ్చిన డబ్బుతో భారీగా స్థలాలు కొనుగోలు చేశాడట.

హైదరాబాద్‌లోని కొంపల్లిలో దాదాపు 35 ఎకరాల ద్రాక్ష తోటను, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆరు ఎకరాల భూమిని, తమిళనాడు, చెన్నైలో దాదాపు 15 ఎకరాల విలువ చేసే భూమిని కొనుగోలు చేశారు. కానీ వాటిని మెయింటైన్ చేయలేక అన్నింటినీ కోల్పోయాడు. తన బిజీ షెడ్యూల్ వల్ల కొనుగోలు చేయడమే కానీ వాటిని కాపాడుకోలేకపోయాడు. అలా చంద్రమోహన్ దాదాపు 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.