Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా చంద్రముఖి. పి.వాసు డైరెక్షన్‌లో, 2005లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు డైరెక్టర్ వాసు తెలిపారు.
చంద్రముఖి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్ తీయాలని అప్పట్లోనే అనుకున్నారట. కానీ దీనిపై రజినీకాంత్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడంతో ఆ ప్లాన్ మధ్యలోనే ఆగిపోయిందట. కొన్ని రోజులకు చంద్రముఖి తరహాలోనే నాగవల్లి అనే సినిమా వచ్చింది. ఇది చంద్రముఖి సినిమాకు రిలేటెడ్‌గానే ఉన్నా సీక్వెల్ మాత్రం కాదు. చంద్రముఖి సినిమాతో కనెక్ట్ అయ్యే నాగవల్లి స్టోరీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ చంద్రముఖి సినిమా మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. రజినీకాంత్‌కు ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఈ సినిమాను లారెన్స్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నాడట దర్శకుడు. చంద్రముఖి సినిమాలో కనిపించే పెద్ద పాముకు సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉండదు.
జస్ట్ రెండు మూడు సీన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. సినిమా కథ మొత్తం చంద్రముఖి పాత్ర చుట్టే తిరుగుతింది. సినిమా ఎండ్‌లో పాము ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కానీ ఇప్పుడు తీస్తున్న సీక్వెల్‌లో కథ మొత్తం పాము చుట్టే తిరుగుతుందని హింట్ ఇచ్చారు దర్శకుడు పి.వాసు. అసలు గదిలో పాము ఎందుకు ఉంది అనేదే కథలో మెయిన్ పాయింట్. చంద్రముఖి కథలో పాముకున్న ఇంపార్టెన్స్ మీదే కథ బేస్ అవుతుందట. ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్రాఫిక్స్‌తో సినిమాను మరింత రియలిస్టిక్‌గా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు పి.వాసు. త్వరలోనే సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారట.