Chelsea Islan: ఇండోనేషియా హీరోయిన్‌తో పాటు లిస్ట్‌లో మరొకరు..?

చెల్సియానే మహేశ్ హీరోయిన్ అంటూ గత నెలరోజులుగా గుసగుసలొస్తున్నాయి. కానీ, ఇప్పుడా గుసగుసలే నిజం అనుకునేందుకు కారణ.. చెల్సియా తాజాగా రాజమౌళి ఇన్‌స్టాను ఫాలో కొట్టడమే. మార్చ్‌లో స్టార్ కాస్ట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 07:13 PM IST

Chelsea Islan: రాజమౌలి మేకింగ్‌లో మహేశ్ బాబు చేయబోయే సినిమాలో ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్లను ట్రై చేస్తోంది ఫిల్మ్ టీం. నెలరోజులుగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేరు వినిపిస్తోంది. తను హాలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తే, ఇండోనేషియా మూవీల్లో చాలా ప్రయోగాలు చేసింది. ఇక థోర్.. ఫేం క్రిస్ హోమ్ వర్త్‌తో ఓ సినిమా చేయబోతున్న చెల్సియానే మహేశ్ హీరోయిన్ అంటూ గత నెలరోజులుగా గుసగుసలొస్తున్నాయి.

Jr NTR: హృతిక్, ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న సిగ్నేచర్ సాంగ్..?

కానీ, ఇప్పుడా గుసగుసలే నిజం అనుకునేందుకు కారణ.. చెల్సియా తాజాగా రాజమౌళి ఇన్‌స్టాను ఫాలో కొట్టడమే. అవును ఇండియాన్ స్టార్స్‌లో దీపికా, దిశాని మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అయ్యే చెల్సియా, కొత్తగా రాజమౌళి ఇన్‌స్టాను కూడా ఫాలో అవటం చూస్తుంటే, తనే మహేశ్ మూవీలో మెరిసే హీరోయిన్ అనుకోవచ్చు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం మరో హాలీవుడ్ హీరోయిన్ కాల్‌షీట్స్ కూడా పట్టేందుకు ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ హీరోయిన్ పేరే జెండాయా మేరీ స్టోయేర్‌మేర్. స్పైడర్ మ్యాన్ హోమ్ కమ్మింగ్, ఫార్ ఫ్రం హోమ్, నో వే హోమ్ సినిమాల్లో మెరిసి ఫేమస్ అయిన జెండాయా ఇప్పడు మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో నటించే అవకాశాలున్నాయి.

అంతేకాదు డ్యూన్‌తో దండెత్తి డ్యూన్2తో దాడికి రెడీ అయిన ఈ యంగ్ హాలీవుడ్ లేడీ కూడా రాజమౌళి మూవీ మీద ఆసక్తి చూపిస్తోందట. కానీ, 90 కోట్ల రెమ్యునరేషన్ దగ్గరే ఫిల్మ్ టీం ఆలోచనల్లో పడినట్టు తెలుస్తోంది. మార్చ్‌లో స్టార్ కాస్ట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.