సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం విచారించగా… అల్లు అర్జున్ నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా అల్లు అర్జున్ ను 18 ప్రశ్నలు అడిగిన పోలీసులు… అల్లు అర్జున్ చెప్పే సమాధానాలు అన్నీ రికార్డు చేసుకున్నారు. అలాగే టైపింగ్ కూడా చేసుకున్నారు. ముఖ్యంగా సంధ్య ధియేటర్ లోపలికి అల్లు అర్జున్ వస్తున్న వీడియో, లోపల కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియో లు చూపించి ప్రశ్నలు అడిగారు పోలీసులు.
వీడియోలు చూపించి ప్రశ్నలు అడగడంతో మౌనం వహించాడట అల్లు అర్జున్. వతి మృతి పై పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసిన బన్నీ… తప్పు జరిగింది ఇలా జరుగుతుందని ఊహించలేదని సమాధానం ఇచ్చాడు. మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అనే ప్రశ్నకు అవును.. నాకు తరువాత రోజే తెలిసిందని చెప్పాడు అల్లు అర్జున్. ఇక తన పీఆర్ టీమ్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని సమాధానం ఇచ్చాడు. అలాగే 50 మందికి పైగా బౌన్సర్ లను పెట్టడం తప్పేనని ఒప్పుకోవడం గమనార్హం.
ఏసీపీ, డీసీపీ మీకు ఆడిటోరియం లో కలిసారా? అని అడగగా వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదని సమాధానం చెప్పాడు. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేసారని వాపోయాడట. సంధ్య థియేటర్ వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాలని భావించిన పోలీసులు వాహనాలను కూడా తెప్పించారు. అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో వెనక్కు తగ్గారు.