Chinmayi Sripada: భారత్‌లోనే ఇలా? మరో వివాదంలో సింగర్ చిన్మయి

భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడటం ఖర్మ అంటూనే.. స్టుపిడ్ ఇండియా అని దేశాన్ని తిట్టిపోయడం వివాదస్పదమైంది ఆమెపై హైదరాబాద్‌లో కేసు కూడా నమోదైంది. లేటెస్ట్‌గా జార్ఖండ్‌లో విదేశీ మహిళపై జరిగిన రేప్ విషయంలోనూ చిన్మయి చేసిన కామెంట్స్ కాంట్రోవర్సీ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 01:58 PM IST

Chinmayi Sripada: సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మా ఖర్మ.. స్టుపిడ్ ఇండియా అన్న కామెంట్స్‌పై ఈమధ్యే ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు జార్ఖండ్‌లో ఓ విదేశీ మహిళ రేప్ కేసుపై చిన్మయి స్పందించిన తీరుపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఎవరో కొందరు దుర్మార్గులు చేసిన పనికి భారతీయులందర్నీ అవమానిస్తావా అంటూ మండిపడుతున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సింగర్ చిన్మయి శ్రీపాద. సోషల్ ఇష్యూస్‌పై ఆమె స్పందించడాన్ని ఎవరూ తప్పబట్టడం లేదు. కానీ లాంగ్వేజ్‌లోనే తేడా వస్తోంది. అమ్మాయిలకు రాత్రిపూట పనేంటి.. బయటకు వెళ్ళకపోతే ఏమవుతోందని.. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్యూలో చేసిన కామెంట్స్ పై చిన్మయి స్పందించింది.

MUDRAGADA : వైసీపీలోకి ముద్రగడ.. ఏ హామీ లేకుండానే…

భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడటం ఖర్మ అంటూనే.. స్టుపిడ్ ఇండియా అని దేశాన్ని తిట్టిపోయడం వివాదస్పదమైంది ఆమెపై హైదరాబాద్‌లో కేసు కూడా నమోదైంది. లేటెస్ట్‌గా జార్ఖండ్‌లో విదేశీ మహిళపై జరిగిన రేప్ విషయంలోనూ చిన్మయి చేసిన కామెంట్స్ కాంట్రోవర్సీ అయ్యాయి. స్పానిష్ మహిళ తన భర్తతో కలసి బైక్ ట్రావెలింగ్ చేస్తూ భారత్‌కు వచ్చింది. ఆమెను జార్ఖండ్‌లో కొందరు దుర్మార్గులు రేప్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పోలీసులు.. నిందితులు ఏడుగురిని అరెస్ట్ చేశారు కూడా. ఈ సంఘటన నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. మహిళలను తల్లులుగా గౌరవించే మన దేశంలో ఫారెన్ ఉమెన్ పై జరిగిన ఘోరానికి అందరూ బాధపడ్డారు. సింగర్ చిన్మయి కూడా తన బాధను వ్యక్తం చేశారు. కానీ అందులో మరోసారి భారత్ ను అవమానించేలా మెస్సేజ్ పెట్టారని నెటిజన్స్ మండిపడుతున్నారు. “ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్, అరబ్ కంట్రీస్.. ఇలా చాలా దేశాలు వెళ్ళింది. కానీ భారత్‌లో ఏం జరిగింది. ఏడుగురు కలసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు” అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. “ఎవరైనా ఒలింపిక్ మెడల్ గెలుచుకుంటే భారతీయులంతా గర్వపడతారు.

REVANTH WHY : రేవంత్ జాగ్రత్త పడుతున్నారా ? ముందుచూపుతోనే మోడీతో అలా…

అలాగే కొంతమంది పురుషులు అత్యాచారం చేస్తే భారతీయులంతా సిగ్గుపడాల”ని కామెంట్ చేశారు చిన్మయి. దాంతో నెటిజెన్లు ఆమె ట్వీట్‌కి పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. మీ లాజిక్ తప్పు.. ఒలింపిక్ విజేతల కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చుపెట్టి శిక్షణ ఇప్పిస్తోంది. కానీ రేపిస్టులకు అలా డబ్బులు ఖర్చుపెట్టి ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. చట్టాలు కఠినంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు ఓ నెటిజన్. ఒలింపిక్స్ విజేతలను అవమానిస్తున్నావని మండిపడ్డారు మరొకరు. భారత్‌లో ప్రతి 17 నిమిషాలకు మహిళలపై రేప్ జరుగుతోంది.. అంటే ప్రతి 17 నిమిషాలకు మనం సిగ్గుపడాల్సిందేనా అని ఒకరు కామెంట్ చేయగా.. విదేశీ మహిళలకు అలా జరగడం దారుణమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అమెరికాలో 15 మంది విద్యార్థులను చంపేస్తే ఎందుకు మాట్లాడలేదని మరొకరు ప్రశ్నించారు. రేప్ బాధితురాలు.. స్పానిష్ మహిళ మాత్రం భారత్‌పై తన ప్రేమను వ్యక్తం చేసింది. “భారతీయులందర్నీ అవమానించవద్దు. వాళ్ళల్లో కొందరు క్రిమినల్స్ తప్ప మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇండియాలో 6 నెలల్లో 20 వేల కిలోమీటర్లు సేఫ్‌గా తిరిగాను. మాకు ఎక్కడా ఇబ్బంది ఎదురవలేదు.

ఎక్కడికి వెళ్ళినా నన్ను మంచిగానే చూసుకున్నారు” అంటూ భారతీయులపై కొందరు చేస్తున్న విమర్శలకు స్పానిష్ మహిళ చెక్ పెట్టారు. భారత్ పర్యటనలో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన నెటిజెన్స్ ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు. ఇప్పుడు సింగర్ చిన్మయిపై ఇలాగే వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.