Chinna: ఈ వారం నాలుగు తెలుగు సినిమాల్లో ఒకటే ఆకట్టుకుంటే, రెండు డబ్బింగ్ మూవీల్లో కూడా ఒకటే ఆకట్టుకునేలా ఉంది. 800, చిన్నా.. అనే రెండు డబ్బింగ్ మూవీలు ఈ వీక్ టాలీవుడ్ మార్కెట్ కి కిక్ ఇవ్వబోయాయి. కాని అందులో ఒకటి షాక్ ఇచ్చింది. ఇక 800 మూవీ విషయానికొస్తే శ్రీలంకన్ మాజీ క్రికెట్ ప్రేయర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా వచ్చింది ఈ సినిమా. మేకింగ్, పెర్ఫామెన్స్ బాగున్నా, బోరింగ్ నెరేషణ్ కొంపముంచింది.
ముత్తయ్య మురళీధరన్ కెరీర్ లో ఎత్తు పల్లాలు చూపించబోయి, కేవలం ఎమోషనల్ సీన్స్ నే హైలెట్ చేస్తూ, అసలు క్రికెట్ నే పక్కన పెట్టేసింది ఫిల్మ్ టీం అంటున్నారు. ఎంత బయోపిక్ అయినా, తను క్రికెట్‌ని ఎంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడు. ఎంతగా అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్ముదులిపాడో ఎలివేట్ చేయలేకపోయారు. బోరింగ్ ఎమోషనల్ సీన్స్‌తో నింపారు. అదే సిద్దార్ధ్ చిన్నా విషయానికొస్తే కథ కదిలిస్తోంది. పెర్పామెన్స్‌తోపాటు మేకింగ్ మతిపోగొడుతోంది. బొమ్మరిళ్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి హిట్ల తర్వాత ఆరేంజ్ హిట్లులేక, తనకి ఇక్కడ డిమాండ్ పెరక్క ఇంతకాలం డీలా పడ్డాడు సిద్దూ.
ఇప్పుడు చిన్నా అంటూ మనీనే కాదు మనసుని కూడా పెట్టి ప్రయోగం చేశాడు. అన్న కూతురు మిస్ అవటం, చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు ఈ రెండు పాయింట్లతో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా రియాలిస్టిక్ గా కిక్ ఇస్తోంది. సిద్దూతోపాటు చిన్న పాప, మిగతా ఆర్టిస్ట్ ల నటన కిక్ ఇస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా నెరేషన్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.