Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రోతో బాక్సాఫీస్‌పై దండెత్తాడు. సాయితేజ్ భారమంతా కూడా పవన్ తన నెత్తిమీదే వేసుకున్నాడు. తనే కాలంగా మారి సాయితేజ్‌కి టైం కలిసొచ్చేలా చేస్తున్నాడు. నిజంగానే సింపుల్ కథ కాస్తా.. కమర్శియల్‌గా రూ.200 కోట్ల బిజినెస్ చేసిందంటే, అంతా పవన్ మహత్యమే. బ్రో మూవీలో రొబాటిక్‌గా బతికే ఓ యువకుడికి యాక్సిడెంట్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చే కాలంగా పవన్ వేసిన పాత్రతో ఓ క్లాస్ మూవీ కాస్త కమర్శియల్ కహానీగా మారింది.
మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్, ఆగస్ట్ ఫస్ట్ వీక్ రాబోయే ఓజీ గ్లింప్స్, ఇలా పవన్ వరుసగా మాస్ మూవీలతో ఇండస్ట్రీని ఊపేసేలా ఉన్నాడు. ఇక చిరు వేదాళం రీమేక్ భోళా శంకర్ ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు. టీజర్ చూసి డిజప్పాయింట్ అయిన మెగా ప్యాన్స్‌కి ట్రైలర్ కిక్ ఇచ్చింది. ఇక్కడ బ్రోకి, భోళా శంకర్‌కి కామన్ పాయింట్ ఏదైనా ఉందంటే.. అదే రీమేక్. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ములు రీమేక్స్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి పెంచేలా ఉన్నారు. ఆల్రెడీ బ్రో అంటూ మల్టీ గెటప్స్‌తో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, తమ్ముడు మూవీలను కలిపి చూపించేశాడు పవన్. ఫైనల్‌గా బ్రోలో పవన్ లేకపోతే ఏం లేదనేంతగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు.
సో బ్రోకి టాక్ కిక్ ఇస్తోందంటే, రెండువారాల తర్వాత భోళా శంకర్‌తో కిక్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. అసలే శంకర్ దాదా స్టైల్‌లో తెలంగాణ యాస చిరుకి కలిసొచ్చింది. ఇప్పుడు భోళా శంకర్‌లో పేరుతో పాటు, యాస రిపీట్ కానుంది. దీంతో ఇది కూడా అలాగే సక్సెస్ కొడుతుందేమో చూడాలి.