CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవికి ఫిజియోథెరపి.. ఎంతకాలం విశ్రాంతి అంటే..

వశిష్ట మేకింగ్‌లో చిరు చేసే సోషియో ఫాంటసీ సినిమా డిసెంబర్‌లో మొదలు కానుంది. చిరు మోకాలికి జరిగింది మైనర్ సర్జరీనే. కాకపోతే ఏజ్ పరంగా మెగాస్టార్ కనీసం రెండు నెలలు ఇంటికే పరిమితమవ్వటమే కాదు, ఫిజియో థెరపీ తీసుకోవాల్సి వస్తోంది.

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 06:59 PM IST

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరి హెల్త్ అప్‌డేట్స్ అందాయి. ఇప్పటికే చిరంజీవికి డాక్టర్లు కనీసం రెండునెలల విశ్రాంతితోపాటు ఫిజియోథెరపీని సూచించారు. అంటే నవంబర్ వరకు మెగాస్టార్ ఇంటికే పరిమితం కాబోతున్నాడు. డిసెంబర్‌లోనే సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు.

వశిష్ట మేకింగ్‌లో చిరు చేసే సోషియో ఫాంటసీ సినిమా డిసెంబర్‌లో మొదలు కానుంది. చిరు మోకాలికి జరిగింది మైనర్ సర్జరీనే. కాకపోతే ఏజ్ పరంగా మెగాస్టార్ కనీసం రెండు నెలలు ఇంటికే పరిమితమవ్వటమే కాదు, ఫిజియో థెరపీ తీసుకోవాల్సి వస్తోంది. ఐతే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం కనీసం మూడు నెలలు ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. తనకి చిరులానే మైనర్ సర్జరీ కాలేదని తెలుస్తోంది. ప్రభాస్ మోకాలికి జరిగిన సర్జరీ అబ్జర్వేషన్ కోసమే యూరప్‌లో నెలకిపైనే గడుపుతున్నాడు ప్రభాస్.

ఆ తర్వాత ఇండియా వచ్చినా కనీసం రెండు నుంచి రెండున్నర నెలల వరకు ఫిజియో థెరపీ చేయించుకోవాలట. ఈ లెక్కన జనవరిలో కూడా తను కల్కి పెండింగ్ షూటింగ్‌కి హాజరయ్యే పరిస్థితి లేదు. మారుతి మూవీ షూటింగ్ షెడ్యూల్ కూడా సమ్మర్‌కే వాయిదా పడుతోంది. మొత్తంగా కనీసం రెండు నుంచి మూడు నెలలు, అటు చిరు, ఇటు ప్రభాస్ షూటింగ్స్‌లో జాయిన్ కాలేరని తెలుస్తోంది.