ఒకప్పుడు స్టార్ హీరోలు కలిసే ఉండేవారు. ఆ తర్వాతనే అభిమానుల్లో పోటీ పెరగడం, వంద రోజులు, వంద కోట్ల పిచ్చితో దూరమయ్యారు. అగ్ర హీరోలు వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేసేవారు. ఆ తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు రావడమే కష్టం అయిపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చే వరకు మల్టీ స్టారర్ సినిమాలు పెద్దగా ఊపందుకోలేదు అనే చెప్పాలి. ఒకప్పుడు అయితే మెగా, నందమూరి కుటుంబాల మధ్య పెద్ద వార్ కూడా నడిచేది పరోక్షంగా. సినిమాల్లో ఒకరిని టార్గెట్ చేస్తూ ఒకరు డైలాగ్స్ కూడా పెట్టేవాళ్ళు.
అదే మెగా నందమూరి ఫ్యామిలీలు ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవి. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమాల్లో చిరంజీవి కూడా నటించారు. అలాగే అల్లు రామలింగయ్యకు ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం అనేది ఉండేది. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల్లో రామలింగయ్య నటించేవారు. ఎన్నో రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించేవారు. స్వేచ్చగా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేవారు కూడా అప్పట్లో. ఇక చిరంజీవికి, బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహం ఉండేదట. బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమాకు చిరంజీవి ప్రచారం కూడా చేసారట.
ఆదితి 369 సినిమా అప్పట్లో ఒక సంచలనం. బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇదే. సినిమా చాలా బాగా రావడంతో ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఆడవాళ్ళను, చిన్న పిల్లలను సినిమాకు వచ్చేలా చేయాలంటే చిరంజీవి వల్లనే సాధ్యం అని భావించి ఆయనతో దూరదర్షన్ లో ప్రచార కార్యక్రమాలు చేసారు. వాటికి మంచి స్పందన వచ్చి ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ప్రేక్షకులే సినిమాకు వచ్చారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి కూడా ఒక సంచలనం అనే చెప్పాలి.